‘చిరు’ ని కంటిచూపుతో చంపేసిన మోహన్ బాబు
మోహన్ బాబు కు కొద్దిగా కీ ఇస్తే చాలు రెచ్చిపోయి మాట్లాడతారు. కానీ ఈసారి చాలా బ్యాలెన్స్ డ్ గామాట్లాడారు. ఆ మధ్య ఎన్ టీవీ లైవ్ షోకు హాజరైన మోహన్ బాబును కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూ చేశారు. ఫోన్లో వచ్చే కాల్స్ కు సమాధానం కూడా చెప్పారు. కొత్తగా పార్టీ పెట్టిన సినిమా హీరో ఎందుకు ఫెయిలయ్యారనుకుంటున్నారు? అని ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి గురించి అడిగితే ప్రేక్షకులనే అడగాలి" అంటూ సమాధానం దాటవేశారు. ఇద్దరు అమ్మాయిలు పోన్ చేసి చిరంజీవి, మోహన్ బాబు మధ్య నెలకున్న వజ్రోత్సవ, స్టార్ నైట్ వివాదాన్ని ప్రస్తావిస్తే 'మీరు మరోసారి వజ్రోత్సవ కార్యక్రమాన్ని చూడండి ఎవరేం మాట్లాడారో తెలుస్తుంది" అంటూ టాపిక్ ను ముగించారు. ఇంతా చేసిన మోహన్ బాబు పైకి ఏమీ మాట్లాడక పోయినా కంటితో మాత్రం చిరును మింగేసేలా ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.
More from Filmibeat
చిరంజీవి మోహన్ బాబు ఎన్ టీవీ లైవ్ షో కొమ్మినేని శ్రీనివాసరావు వజ్రోత్సవ స్టార్ నైట్ chiranjeevi mohan babu ntv live show kommineni srinivasa rao vajrostavam star night


Click it and Unblock the Notifications











