ప్రాణాపాయం తప్పించుకున్న మోహన్ బాబు...సేఫ్
వెంటనే ఎలర్టైన సినీ యూనిట్ మోహన్ బాబుని రక్షించారు. ఆయన, ఆయన భార్య చిన్న గాయాలతో బయిటపడ్డారు. దీనివల్ల షూటింగ్ ఆగిపోయింది. వీరిద్దరూ క్షేమంగా చేరుకునేసరికి దర్శకుడు రిలీఫ్ ఫీలయ్యారు. ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం గోల్ మాల్ రీమేక్ గా రూపొందుతోంది. 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. విష్ణు, మనోజ్ నిర్మాతలు.
మోహన్ బాబు, తన ఇద్దరు కుమారులతో కలిసి ఒకేసారి తెరపై కనిపించనున్నారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు, మనోజ్‌లతోపాటు వరుణ్‌సందేశ్, తనీష్‌లు హీరో పాత్రలు పోషించబోతున్నారు. ఇక మోహన్ బాబు సరసన ...ప్రముఖ హిందీ నటి రవీనా టాండన్ కనిపించనుంది. ఆమెతోపాటు హన్సిక, ప్రణీత హీరోయిన్స్ .
నిర్మాతలు మాట్లాడుతూ ''మేమిద్దరం హీరోలుగా నిలదొక్కుకోవడానికి డాడీయే స్ఫూర్తి. ఆయన శ్రమ మమ్మల్ని నిలబెట్టింది. ఇప్పుడు డాడీ హీరోగా మేం సినిమాను నిర్మించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించబోతున్నామనే విషయం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆద్యంతం వినోదాన్ని పంచే కుటుంబ కథా చిత్రమిది'' అన్నారు.
అలాగే ఎన్నో ప్రత్యేకతలతో, ఇంతవరకూ తెలుగులో రానివిధంగా ఈ చిత్రం నిర్మాణం కాబోతోంది. ఇది ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మాకు సినీ జన్మను ప్రసాదించిన మా తండ్రి మోహన్‌బాబుతో మొదటిసారి మేం నిర్మిస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ మించి ఉంటుంది. ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూరుస్తారు అన్నారు. రచన: గోపీ మోహన్, కోన వెంకట్, బీవీయస్ రవి, ఛాయాగ్రహణం: పళనికుమార్, సమర్పణ: అరియానా, వివియానా.


Click it and Unblock the Notifications












