మోహన్ బాబు హౌస్ అరెస్ట్.. చుట్టుముట్టిన పోలీసులు!
Recommended Video

సీనియర్ నటుడు మోహన్ బాబు తరచుగా రాజకీయ పరమైన అంశాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణంలో కూడా మంచు ఫ్యామిలీ భాగమవుతూ ఉంటుంది. వీటితో పాటు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థల్ని కూడా నడిపిస్తున్నారు. శ్రీ విద్యానికేతన్ సంస్థకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో మోహన్ బాబు ప్రభుతంపై గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం రోజు తన విద్యాసంస్థ విద్యార్థులతో కలసి ప్రభుత్వనికి వ్యతిరేకంగా ధర్నాకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణాలు చోటు చేసుకుంటున్నాయి.

మోహన్ బాబు హౌస్ అరెస్ట్
మోహన్ బాబు ధర్నాని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన్ని గృహనిర్బంధం చేస్తున్నారు. మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేస్తుండడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఉదయమే మోహన్ బాబు తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ కు చేరుకున్నారు. పోలీసులు విద్యానికేతన్ సంస్థని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. కానీ మోహన్ బాబు మాత్రం పోలీసుకు ఎదురు తిరిగి అయినా సరే ధర్నా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నిసార్లు విన్నవించినా
తమ విద్యాసంస్థకు రావాల్సిన ఫీజు బకాయిలని చెల్లించాలని ఎన్నిసార్లు కోరుతున్నా ప్రభుతం పట్టించుకోవడం లేదని మోహన్ బాబు గతంలో ఓ సారి మీడియా సమావేశంలో అన్నారు. ప్రతిసారీ ప్రభుతాన్ని రిక్వస్ట్ చేయడానికి మేము అడుక్కునేవాళ్లమా అంటూ మోహన్ బాబు ఘాటైన విమర్శలు చేశారు.

రాజకీయ కారణాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యానికేతన్ సంస్థకు ఫీజు బకాయిలు చెల్లించక పోవడానికి రాజకీయ అంశాలే కారణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుని విమర్శించారు. ఐదేళ్లలో 16 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇలాగైతే తాము ఎలా సంస్థల్ని నడిపించాలి. మా ఆస్తులు తాకట్టు పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని మంచు విష్ణు ఆరోపించారు.

ఉద్రిక్త వాతావరణం
తిరుపతిలోని విద్యానికేతన్ సంస్థ వద్ద పోలిసుల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మోహన్ బాబుని గృహనిర్బంధం చేయాలనీ భావిస్తున్న తరుణంలో ఆయన ఎలా ముందడుగు వేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇది విద్యార్థుల సమస్య, ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారా లేక మోహన్ బాబుతో చర్చలు జరుపుతారా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











