టైట్ సెక్యూరిటీ తో మోహన్ బాబు ఇల్లు
ఆర్మీ, పోలీసు లకు సంభందించిన గార్డులు వెపన్స్ తో హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంటిని ఇరవై నాలుగు గంటలూ కాపలా కాస్తున్నారు. మూడు లేయర్ల సెక్యూరిటీ ని ఎరేంజ్ చేసారు. దీనితో పాటు మోహన్ బాబు ప్రెవేట్ సెక్యూరిటీ కూడా కంటికి కునుకు లేకుండా పనిచేస్తున్నారు. ఇదంతా హైదరాబాద్ ముస్లింలకు చెందుతుందని మోహన్ బాబు కామెంట్ చేయటంతో వచ్చింది. బజరంగ్ దళ్ వారు ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని ఈ తరహా రక్షణను మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్నారు. మరో ప్రక్క హైకోర్టు కూడా మోహన్ బాబుకు వ్యతిరేకంగా రిట్ పిటీషన్ స్వీకరించి అరెస్టు వారెంట్ జారీ చేసింది. మరో ప్రక్క ఈ గొడవ మొదలైన నాటి తెలంగాణ వివాదం అలాగే ఉంది. దాంతో గవర్నమెంట్ కూడా కలగచేసుకుని ఈ రక్షణను ఇస్తోందని తెలుస్తోంది. దాంతో ఆయన ఇంటి మీదుగా వెళ్ళే వాహనాలను సైతం స్లోగా పోనివ్వటం లేదు. అలాగే ఎవరన్నా ఈ హంగామా చూసి ఫొటోలు తీసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోవటం లేదు. మొత్తానికి మోహన్ బాబు ఇంటివద్ద సినిమా షూటింగ్ వాతావరణం ఉందని కొందరు అంటే లోపలి వారు మాత్రం టెన్షన్ క్రియేట్ అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











