మోహన్ బాబు సవాల్

ఇక 'రాజు మహారాజు' చిత్రంలో ఎం.మోహన్ బాబు, శర్వానంద్ కలిసి నటిస్తున్నారు. సుర్విన్ చావ్లా, తషు కౌశిక హీరోయిన్లు. మోహన్ బాబుకు జంటగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. భానుశంకర్ దర్శకత్వంలో పత్తికొండ కుమార స్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారంతో పూర్తయింది. ఈ సినిమా గురించి మోహన్ బాబు మాట్లాడుతూ చాలామంది నిర్మాతలు చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి అన్నట్టుగా ఉంటారనీ, అయితే కుమారస్వామి చెప్పిన విధంగానే సినిమాను తీర్చిదిద్దడం ముచ్చట గొలుపుతోందనీ ప్రశంసించారు. శర్వానంద్ కు అన్నయ్యగా ఓ మంచి పాత్రను ఇందులో పోషిస్తున్నట్టు చెప్పారు.
కథ నచ్చి సినిమా తీసిన్టటు నిర్మాత కుమారస్వామి తెలిపారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ, తాను, మోహన్ బాబు కలిసి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించామనీ, మళ్లీ కలిసి నటిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముందనీ అన్నారు. మోహన్ బాబుతో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగానని శర్వానంద్ పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి మేలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications











