నాకు మోహన్ బాబు స్పూర్తి...అంటున్న అజయ్
నేను విలన్ నుంచి హీరోగా మారే క్రమంలో ఉన్నాను. కాబట్టి నా ముందుకు వచ్చిన అన్ని పాత్రలూ చేస్తా. విభిన్నమైన పాత్రల్నే ఇస్తున్నారు. ఇటీవల ఆర్య 2లో సుబ్బిరెడ్డి పాత్రకు మంచి స్పందన వచ్చింది. విలన్ వేషాల మూలంగా వచ్చిన అనుభవం ఇప్పుడు నాకు ఉపయోగపడుతోంది. ఈ విషయంలో నాకు మోహన్‌బాబు స్ఫూర్తి. ఆయన పోషించిన పాత్రలు, నటన నాకు పాఠాలు అంటున్నారు విలన్ నుంచి హీరోగా ఎదిగిన అజయ్. ఆయన తాజా చిత్రం సారాయి వీర్రాజు ఈ రోజే(శుక్రవారం) రిలీజు అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మచ్చటించారు. సారాయి వీర్రాజు గురించి చెప్తూ..ఆ పాత్ర పని కల్లు గీయడం... దొంగ సారా కాయడమే పని. మహా స్వార్థపరుడు. మరి అతగాడి గురించి తెర మీద చెప్పడానికి ఏముందా అనుకోవచ్చు. వీర్రాజు జీవితంలోని కొన్ని అనుభవాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటాయి అంటున్నాడు. అలాగే వీర్రాజు పాత్ర నేపధ్యం వివరించాడు. ఆ పాత్రది నర్సీపట్నం దగ్గరి పల్లెటూరు. అతని జీవితంలోకి ప్రవేశించిన మహిళలు కూడా ఈ కథలో కీలక పాత్రధారులే. ముఖ్యంగా ధనలక్ష్మి. ఆమె కథేమిటో? ధనలక్ష్మి మూలంగా వీర్రాజులో ఎలాంటి మార్పు వచ్చిందన్నది తప్పకుండా అందరికీ నచ్చే అంశం. అంచేదాక సాధారణంగా పల్లెటూరి కథ అనగానే గోదారి గట్టున పచ్చగా ఉండే ఊళ్లను చూపిస్తుంటాం. అయితే ఇది కడుపు కాలే వీర్రాజులాంటివాళ్ల కథ కాబట్టి... ఆ ప్రాంతమైతేనే బాగుంటుందని దర్శకుడు కన్నన్ భావించారు. ఇక ఈ చిత్రం హీరోగా ద్వితీయ ప్రయత్నం అంటూనే 'ఆ ఒక్కడు'లో కూడా ఎంతో మనసుపెట్టి చేశాను. అయితే ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాం. 'సారాయి వీర్రాజు' మాత్రం చూసినవాళ్లకి కొత్తగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి నేపథ్యాలు, పాత్రల్ని మనం చూడలేదు. మరి సారాయి వీర్రాజుతో నయినా అతను హీరోగా నిలదొక్కుకోవాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











