మోహన్ ‘బాబు’ ధీమా!
మోహన్ 'బాబు" ఇద్దరు పుత్రరత్నాలు హీరోలయినా తండ్రికి తగ్గ తనయులుగా వారు కీర్తిని మాత్రం ఇంతదాకా సంపాదించ లేదు. పెద్దవాడు విష్ణుకు చెప్పుకోవడానికి 'డీ" రూపంలో ఒక హిట్టయినా వుంది కానీ చిన్నోడు మనోజ్ కి ఇంతదాకా అదీ లేదు. అయితే రాబోయే తన సినిమాలు మాత్రం కచ్చితంగా తనకి విజయం తప్పకుండా వరిస్తుందని మనోజ్ ధీమాగా ఉన్నాడు.
వీరు పోట్ల దర్శకత్వంలో కథా రచయితగా వచ్చిన 'వర్షం" 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి హిట్ చిత్రాలను తీసిన క్రమంలో ఇప్పుడు మనోజ్ హీరోగా రూపొందుతోన్న 'బిందాస్", 'గమ్యం" క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, అనుష్కలతో కలిసి చేస్తోన్న 'వేదం" సినిమాలు తనకి వరుస విజయాలను వరిస్తాయని మనోజ్ గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాలతో ఫేమస్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ వస్తుందని మనోజ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరి మోహన్ 'బాబు" అదృష్టం ఎలా వుందో సినిమా విడుదలైయ్యే వరకూ వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











