ఇళ్లలో చెత్త వేసిన మోహన్ బాబు, రజనీకి చాలెంజ్
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. శ్రీ విద్యానికేతన్ పరిసర గ్రామాల్లో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
అయితే ఆయన అందరిలా చెత్త ఊడవటం కాకుండా...విభిన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా రంగంపేటలో, ఎవరింటి ఎదురుగా ఉన్న చెత్తను వారింట్లోనే పడేసి, వారికి బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో చైతన్యం రావాలంటే ఇలా చేయడమే కరెక్టు అన్న కోణంలో ఆయన 'స్వచ్ఛ భారత్' సాగింది. ప్రధాని పథకాన్ని మోహన్ బాబు కొనియాడారు. విద్యానికేతన్ విద్యార్థులు, సిబ్బందితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు తన బెస్ట్ ఫ్రెండ్, సౌతిండియా స్టార్ రజనీకాంత్‌ను ఈ చాలెంజ్ స్వీకరించాలంటూ నామినేట్ చేసారు. రజనీకాంత్‌తో పాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్, శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి, పుల్లెల గోపీచంద్, సుమలతా అంబరీష్, క్రికెటర్ వెంకటపతి రాజు, ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తదితరులను నామినేట్ చేసారు.


Click it and Unblock the Notifications











