Vishnu Manoj గొడవపై మోహన్ బాబు ఫైర్.. అర్థం చేసుకోవట్లేదంటూ.. తనకేం తెలియదన్న మంచు లక్ష్మీ
ఫ్యామిలీ అన్నాక గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే విభేదాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు అలా మంచు ఫ్యామిలీ విభేదాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మంచు మోహన్ బాబు కుమారులు అయిన మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లుగా గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వినిపించాయి.
అందుకే మంచు మనోజ్ రెండో వివాహానికి కూడా విష్ణు హాజరు కాలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక శుక్రవారం మనోజ్ ఏకంగా ఒక వీడియోను పోస్ట్ చేయడంతో విషయం మరింత హీట్ ఎక్కింది. ఈ క్రమంలో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు.

విష్ణు మాత్రం రాలేదని..
అన్నదమ్ములు, హీరోలు అయిన మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. ఇద్దరూ పలకరించుకుంటున్నప్పటికీ దూరం మాత్రం అలాగే ఉందట. ఇక మంచు మనోజ్ పెళ్లి కూడా అక్క మంచు లక్ష్మీ ఇంట్లోనే జరిగింది. ఆ పెళ్లికి మోహన్ బాబు హాజరు కాగా విష్ణు మాత్రం రాలేదని ప్రచారం సాగింది. ఇక ఇంతకాలం నాలుగు గోడల మధ్య ఉన్న మంచు విష్ణు, మనోజ్ విభేదాలు నేడు నెట్టింట్లో బహిర్గతం అయ్యాయి.
మా వాళ్లను కొడుతుంటాడు..
మంచు మనోజ్ శుక్రవారం ఒక వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. అందులో మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. తన మనిషి అయిన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేసేందుకు వచ్చినట్లుగా మనోజ్ తెలిపాడు. వీడియోలో "నా ఇష్టం.. వాడేదో అంటున్నాడు కదా.." అని విష్ణు అంటున్నాడు. మరోవైపు "ఇదండి అసలు విషయం.. ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు" అని మనోజ్ చెబుతున్నాడు.

విష్ణుపై ఫిర్యాదు..
ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే సారథి అనే వ్యక్తి వద్దన్న వినిపించుకోకుండా అతని ముఖంపై విష్ణు కొట్టాడని తెలుస్తోంది. దీంతో సారథిని హాస్పిటల్ లో చేర్పించారట. అయితే ఆ హాస్పిటల్ కు మంచు మనోజ్, మంచు లక్ష్మీ ఇద్దరు వెళ్లి పర్యవేక్షించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ విషయంపై మంచు విష్ణుపై పోలీసు ఫిర్యాదు చేసే ఆలోచనలో మనోజ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పోస్ట్ డిలీట్ చేయాలని..
ఇదిలా ఉంటే అన్నదమ్ముల గొడవపై తాజాగా మంచు మోహన్ బాబు స్పందించారు. ఇప్పటివరకు గుట్టుగా ఉన్న మంచు ఫ్యామిలీ విభేదాలు పబ్లిక్ లోకి వచ్చేశాయి.దీంతో కొడుకులపై మోహన్ బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కుటుంబంలో జరిగే గొడవలను సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఫేస్ బుక్ పోస్ట్ ను డిలీట్ చేయాలని మంచు మనోజ్ ను ఆదేశించారు. దీంతో మనోజ్ స్టేటస్ డిలీట్ చేశాడు. కానీ ఈలోపే అది తెగ వైరల్ అయింది.

అర్థం చేసుకోలేకపోతున్నారు..
ఇక మంచు మనోజ్, విష్ణు గొడవలను సద్దుమణిగేలా మోహన్ బాబు చర్యలు తీసుకోనున్నారు. సారథి ఇంట్లో జరిగిన విషయంపై మోహన్ బాబు ఆరా తీస్తున్నారట. ఇక ఫ్యామిలీలో అన్నదమ్ములు అన్నాక చిన్న చిన్న గొడవలు ఉండటం సర్వసాధారణం. ఆవేశం అనర్థానికి దారి తీస్తుందనే విషయాన్ని తన కొడుకులు అర్థం చేసుకోలేకపోతున్నారని, కాబట్టి వివాదాన్ని పెద్దదిగా చేయవద్దని మోహన్ బాబు మీడియాను కోరారు.

నాకేం తెలియదు..
ఇక ఈ గోడవ గురించి తనకు ఏం తెలియదని మంచు లక్ష్మీ చెప్పినట్లు తెలుస్తోంది. "నాకు అసలు ఈ గొడవ గురించే తెలియదు. ఈరోజు మా ఇంట్లో లంచ్ పోగ్రామ్ ఉంది. నేను బిజీగా ఉన్నాను. గొడవ గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడను" అని మంచు లక్ష్మీ సమాధానం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











