ఒక పాట కోసం.... 1000 జూనియర్ ఆర్టిస్టులు, 400 మంది డాన్సర్లు!
మోహన్ బాబు మూవీ ‘గాయిత్రి’ హాట్ టాపిక్. ఈ చిత్రంలో ఓ పాటను భారీగా చిత్రీకరిస్తున్నారు.
తెలుగు సినిమా చరిత్రలో మరో భారీ సాంగ్ రూపొందబోతోంది. మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'గాయిత్రి' అనే సినిమాలో ఈ భారీ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. మదన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
'గాయిత్రి' చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. నెక్ట్స్ షెడ్యూల్ ను తిరుపతిలో ప్లాన్ చేసినట్టు సమాచారం. శంకర్ మహదేవన్ పాడిన ఒక పాటను మోహన్ బాబుపై తిరుపతిలో చిత్రీకరించనున్నారు.

ఇలాంటివి చాలా రేర్
తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి భారీ పాటల చిత్రీకరణ చాలా రేర్ గా జరుగుతుంటాయి. ఈ పాటలో 1000 జూనియర్ ఆర్టిస్టులు .. 400 వందల మంది డాన్సర్లు పాల్గొననున్నారని అంటున్నారు.

భారీ సెట్స్
ఈ పాట చిత్రీకరణ కోసం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అధ్వర్యంలో తిరుపతిలో భారీ సెట్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణకు ఈ సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

హైలెట్
1400 మంది నేపథ్యంలో రూపొందనున్న ఈ సాంగ్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని.... తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే భారీ సాంగ్ అవుతుందని టాక్. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేస్తున్నారట.

భారీ హనుమాన్ విగ్రహం
సెట్స్ లో భారీ హనుమాన్ విగ్రహాన్నికూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు సొంత బేనర్.... లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











