Mohan Babu: రూ. 100 కోట్లతో మోహన్ బాబు కొత్త సినిమా.. ఆ రెండింట్లో ఒకటి! హీరో ఎవరంటే?
కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందారు మోహన్ బాబు. విలక్షణ నటుడిగా, తనదైన డిఫరెంట్ మ్యానరిజం డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. 90వ దశకంలో ఆయన హీరోగా చేసిన పలు హిట్ సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సినీ ఇండస్ట్రీలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే మోహన్ బాబుకు త్వరలో రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయనున్నట్లు తెలిపారు.
ఘోర పరాజయం: సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచు మోహన్ బాబు మంచి పేరు తెచ్చుకున్నారు. కలెక్షన్ కింగ్ అని ఆయన్ను ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు మాత్రం పరిమితంగానే సినిమాలు చేస్తూ, వారి యూనివర్సిటీని డెవలెప్ చేయడంలో బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే సన్ ఆఫ్ ఇండియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది.

తీర్థ ప్రసాదాలు: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా గురువారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ 1న ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మంచు మోహన్ బాబు శ్రీవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు. పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చక్కగా దర్శనాలు: అనంతరం మీడియాతో ముచ్చటించారు మోహన్ బాబు. "ఈ ఏడాది మొట్టమొదటిసారిగా శ్రీనివాసుడి దర్శనం అద్భుతంగా జరిగింది. ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, డిసిప్లీన్ ఇంతకుముందు ఎప్పుడూ టీటీడీలో చూడలేదు. టీటీడీ ఈవో ధర్మారెడజడి, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు చక్కగా జరుగుతున్నాయి" అని మోహన్ బాబు తెలిపారు.

వంద కోట్లతో సినిమా: "ధర్మారెడ్డి గారికి జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. అందుకే ఆయన్ను అలా చూసేందుకు బాధగా ఉంది. సినిమా విషయానికొస్తే రూ. 100 కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రాన్ని చేయబోతున్నాం. ఆ వివరాలను ఇప్పుడే చెప్పలేను. త్వరలోనే విష్ణు తెలియజేస్తారు" అని కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఎవరు నటిస్తారు: అయితే గతంలో మోహన్ బాబుతో రావణ బ్రహ్మా అనే సినిమాను చేయాలనుకున్నారు. కానీ అది ప్రారంభదశలోనే ఆగిపోయింది. తర్వాత మంచు విష్ణు ప్రధాన పాత్రలో తనికెళ్ల భరణితో భక్త కన్నప్ప మూవీ రూపొందించాలనుకున్నారు. ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇప్పుడు రూ. 100 కోట్ల బడ్జెట్ తో అంటే ఆ రెండు సినిమాల్లో ఒకటి చేస్తారా.. లేదా మరైదైనా చేస్తారా, అందులో మోహన్ బాబు నటిస్తారా, లేదా విష్ణు కానీ మనోజ్ కానీ నటిస్తారా అనే అనుమానాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











