twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల ముందే చేస్తారు, పరోక్షంగా మోహన్ బాబు .. నాగార్జున నోట బాలయ్య సినిమా!

    |

    టాలీవుడ్ లో కళాబంధుగా పేరుగాంచిన ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త టి సుబ్బిరామిరెడ్డి ప్రతి సంవత్సరం టీఎస్ఆర్ అవార్స్డ్ పేరుతో చిత్ర పరిశ్రమకు పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 2017-18 సంవత్సరానికిగాను టీఎస్ఆర్ అవార్డుల వేడుక ఆదివారం రోజు వైజాగ్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు, బాలీవుడ్ నటులు, తమిళ, కన్నడ నటులు కూడా హాజరయ్యారు. స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, మోహన్ బాబు ఒకేసారి వేదికపై కనిపించి అభిమానులని అలరించారు. నాగార్జున, మోహన్ బాబు తమదైన శైలిలో ప్రసంగించి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు.

     నా అన్నయ్యలంతా ఇక్కడే

    నా అన్నయ్యలంతా ఇక్కడే

    వైజాగ్ కు వచ్చి టీఎస్ఆర్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా అన్నయ్యలంతా ఇక్కడే ఉన్నారు అంటూ వేదిపై ఉన్న చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు, టి సుబ్బిరామిరెడ్డిలని ఉద్దేశించి అన్నారు. మోహన్ బాబు నాకు పెద్దన్నయ్య లాంటివారు. ఆయనంటే చాలా ఇష్టం అని నాగార్జున అన్నారు. దీనితో మోహన్ బాబుతో సహా అక్కడున్నవారి ముఖాల్లో నవ్వులు విరిశాయి.

     నాగార్జున నోట బాలయ్య సినిమా

    నాగార్జున నోట బాలయ్య సినిమా

    ఇక అవార్డుల వేడుక గురించి మాట్లాడుతూ.. ఈ వేడుకలో నాకు ఇష్టమైన మూడు సినిమాలకు అవార్డులు వచ్చాయి. అందుకు చాలా సంతోషిస్తున్నా అని సుబ్బిరామిరెడ్డి అన్నారు. తనకు నచ్చిన ఆ చిత్రాల్లో మొదటిది రంగస్థలం అని నాగ్ తెలిపారు. లెజెండ్రీ నటి సావిత్రి బయోపిక్ మహానటి, అలాగే బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలకు కూడా అవార్డులు వచ్చాయని నాగార్జున అన్నారు. జ్యూరీ సభ్యులు చాలా చక్కగా సెలెక్ట్ చేశారు అని ప్రశంసించారు. సుబ్బిరామిరెడ్డిగారు ప్రతి ఏడాది తమని ఇలా ప్రోత్సహిస్తుంటారని నాగ్ తెలిపారు.

    ఎలక్షన్స్ వచ్చినప్పుడే

    ఎలక్షన్స్ వచ్చినప్పుడే

    మోహన్ బాబు మాట్లాడుతూ టి సుబ్బిరామిరెడ్డికి ప్రశంసలతో ముంచెత్తారు. దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమకు సేవలు చేస్తున్నారని అన్నారు. ఆయన నిర్వహించే ప్రతి వేడుకకు నేను హాజరు కావాలని అనుకుంటా. గత ఏడాది జరిగిన టీఎస్ఆర్ అవార్డ్స్ వేడుకకు మా అమ్మగారు మరణించడం వలన రాలేకపోయానని అన్నారు. ఎవరైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడే చేస్తుంటారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ నాకు ఎలాంటి ఓటు అవసరం లేదు, మీ ఆశీస్సులు చాలని సుబ్బిరామిరెడ్డి ఈ తరహా కార్యక్రమాలని నిత్యం నిర్వహిస్తున్నారని తెలిపారు.

     కొంతమంది చేయరు

    కొంతమంది చేయరు

    తనతో పాటు చిరంజీవి, నాగార్జున, బాలయ్య లాంటి నటుల్ని, గొప్ప స్నేహితుడు అయిన బోనికపూర్ ని ఒకే వేదిపై చేర్చిన ఘనత సుబ్బిరామిరెడ్డిది అని అన్నారు. కొంత మంది చేయరు.. ఇతరులు చేస్తే సంతోషించరు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుబ్బిరామిరెడ్డి చక్కటి పాలలాంటి వ్యక్తి అని మోహన్ బాబు ప్రశంసించారు. పాలలోనుంచి పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలన్నీ వస్తాయని, ఎవరికావలసింది వారు కోరుకోవచ్చని తెలిపారు.

    English summary
    Mohan Babu and Nagarjuna Speech at TSR National Film Awards 2017-2018
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X