అది పవన్ విజ్ఞతకే వదిలేశా.., ఈ వయసులో అవసరమా? అన్నాడు విష్ణు: మోహన్ బాబు

Recommended Video

Mohan Babu Angry About Pawan Kalyan Punches On Him

మోహన్ బాబు ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్లే ఉంటుంది. నక్కి నక్కి మాట్లాడటం.. విషయాన్ని దాటవేయడం దాదాపుగా ఆయన డైరీలోనే లేదు. అలాంటి మోహన్ బాబు.. ఓ విషయంపై స్పందించమంటే మాత్రం జవాబు దాటవేశారు. ఇంతకీ ఏంటా విషయం.. ఏమా కథ..

 పవన్ రాజకీయాలపై స్పందించమంటే..:

పవన్ రాజకీయాలపై స్పందించమంటే..:

'గాయత్రి' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో 'పవన్ కల్యాణ్' జనసేన రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో కొంత ఇబ్బందిగా ఫీలైన ఆయన 'నో కామెంట్' అన్నట్టుగా జవాబు దాటవేశారు. సినిమా ఇంటర్వ్యూల్లో రాజకీయాల గురించి మాట్లాడబోనని సూటిగా చెప్పేశారు.

 'వద్దు బ్రదర్..':

'వద్దు బ్రదర్..':

రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదని మోహన్ బాబు చెప్పినప్పటికీ.. సదరు యాంకర్ మాత్రం ఆయన్ను కవ్వించే ప్రయత్నం చేశారు. దీంతో సున్నితంగా 'వద్దు బ్రదర్..' అంటూ వారించారు మోహన్ బాబు. పవన్ రాజకీయాల గురించి కామెంట్ చేయని మోహన్ బాబు.. గతంలో చిరంజీవి పద్మభూషణ్ అవార్డు ఫంక్షన్‌లో పవన్ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు స్పందించడం గమనార్హం.

 పవన్ విజ్ఞతకే వదిలేశా:

పవన్ విజ్ఞతకే వదిలేశా:

చిరంజీవి పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా పవన్ తనను ఉద్దేశించి 'తమ్ముడూ మోహన్ బాబూ' అన్న విషయాన్ని ఆయన ఇప్పుడు గుర్తుచేసుకున్నారు. ఆరోజు జరిగినదాన్ని దాన్ని తాను సరదాగానే తీసుకున్నానని.. పవన్ అలా అన్నందుకు సంతోషించానని చెప్పారు. అయితే పవన్ అలా ఎందుకు అన్నాడా? అని తర్వాత ఆలోచించానని.. ఆపై ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేశానని మోహన్ బాబు అన్నారు.

 నా బిడ్డలు దారితప్పే ఛాన్సే లేదు..:

నా బిడ్డలు దారితప్పే ఛాన్సే లేదు..:

ఇంటర్వ్యూలో డ్రగ్స్ ప్రస్తావన రాగా... ఇటీవలి ఉదంతాన్ని మోహన్ బాబు ప్రస్తావించారు. డ్రగ్స్ అనుమానితుల లిస్టులో తన బిడ్డ పేరు కూడా ఉందనే ప్రచారాన్ని విన్నప్పుడు వెంటనే ముగ్గురిని పిలిచి మాట్లాడానని అన్నారు. డిసిప్లిన్ విషయంలో తాను స్ట్రిక్ట్ గా ఉంటానని, అలాంటి క్రమ శిక్షణలో పెరిగిన బిడ్డలు దారితప్పే ఛాన్సే లేదని స్పష్టం చేశారు.

 ప్రోస్తేటిక్స్ మేకప్..:

ప్రోస్తేటిక్స్ మేకప్..:

శివాజీ - గాయత్రి పటేల్ పాత్రలలో దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న మోహన్ బాబు సినిమా ఫలితం ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కోసం తొలిసారి ప్రోస్తేటిక్స్ మేకప్ వేసుకున్నట్లు తెలిపారు. మేకప్ కోసమే దాదాపు మూడు గంటలు వెచ్చించాల్సి వచ్చేదని, అలాగే రిస్క్ అనిపించినా.. డూప్ లేకుండా ఈ సినిమాలో మూడు ఫైట్స్ చేశానని అన్నారు.

 ఈ వయసులో అవరసరమా?:

ఈ వయసులో అవరసరమా?:

ఫైట్స్ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ వయసులో డూప్ లేకుండా చేయడం అవసరమా? డాడీ అని విష్ణు తనతో అన్నట్టు మోహన్ బాబు చెప్పారు. తాను చేయగలనా?.. లేదా? అని విష్ణు సందేహపడేవాడని, కానీ డూప్ లేకుండా నేను ఫైట్స్ చేయడం చూసి.. ఇంకేమి మాట్లాడలేదని గుర్తుచేసుకున్నాడు.

డైలాగ్ కింగ్ మెప్పిస్తాడా?:

డైలాగ్ కింగ్ మెప్పిస్తాడా?:

'గాయత్రి' థియేట్రికల్ ట్రైలర్‌ లో మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. రచయిత డైమండ్ రత్నం రాసిన సంభాషణలకు మంచి స్పందన లభించింది. దీంతో ఛాన్నాళ్ల తర్వాత డైలాగ్ కింగ్ మరోసారి వెండితెరపై అదరగొట్టబోతున్నారన్న అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 9న విడుదలవుతున్న ఈ సినిమాలో శ్రీయ, మంచు విష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X