twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు మాటలకు సైలెంట్ అయిపోయిన మంచు విష్ణు.. బిగ్గెస్ట్ రిస్క్ అంటూ..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోల్ల్ ఒకరైన మంచు విష్ణు కమర్షియల్ గా ఎక్కువగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోలేదు. అయినప్పటికీ అతను ప్రయత్నాలు ఏ మాత్రం ఆపలేదు. ప్రతిసారి ఎదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ మోసగాళ్ళు సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని సిద్ధమయ్యాడు. అయితే తండ్రి మోహన్ బాబు మాత్రం ఒక విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నట్లు మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.

     బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని

    బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని

    మోహన్ బాబు వారసుడిగా మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు కెరీర్ లో ఇంకా అనుకున్నంత రేంజ్ లో హిట్స్ అందుకోలేదు. ఇప్పటివరకు అతనికున్న ఒకే ఒక్క బిగ్గెస్ట్ హిట్ ఢీ సినిమా మాత్రమే. ఇక ఇప్పుడు ఎలాగైనా మోసగాళ్ళు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని సిద్ధమయ్యాడు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ కూడా పెంచారు.

     రియల్ స్టోరీ ఆధారంగా

    రియల్ స్టోరీ ఆధారంగా

    మోసగాళ్ళు సినిమాను మంచు విష్ణు సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఇండియాకు చెందిన ఇద్దరు అక్కా తమ్ముళ్లు అమెరికాలో చేసిన స్కామ్ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. మంచు విష్ణుకు అక్కగా ఈ సినిమాలో కాజల్ నటించింది.

     ఓపెన్ గా చెప్పిన విష్ణు

    ఓపెన్ గా చెప్పిన విష్ణు

    మంచు విష్ణు ఫ్యామిలీ సభ్యులు ఇంటర్వ్యూలలో ఓపెన్ గా మాట్లాడడం గురించి అందరికి తెలిసిందే. ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారి ఎదో ఒక కామెంట్ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే మంచు విష్ణు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ను కూడా ఓపెన్ గానే బయటపెట్టాడు.

    నోరు మూసుకొని ఉన్నాను

    నోరు మూసుకొని ఉన్నాను

    ఈ సినిమాను విష్ణు తన మార్కెట్ పరిధికి మించి ఎక్కువ బడ్జెట్ పెట్టిన విషయం తెలిసిందే. 50కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు టాక్ వస్తోంది. ఆ విషయంలో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు విష్ణు. స్టోరీ లైన్ విన్నప్పుడు ఆయనకు బాగా నచ్చింది. కానీ బడ్జెట్ ఎక్కువ పెడుతున్నావు అని అన్నారు. నేను ఏమనకుండా నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నాను.. అని విష్ణు వివరణ ఇచ్చారు.

     బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటంటే

    బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటంటే

    నా ఉద్దేశంలో బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటంటే.. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడమే. నాన్నగారు తీసుకున్న రిస్కుల కన్నా నేను పెద్దగా ఏమి తీసుకోలేదు. నేను పడిపోతే పైకి లేపే బలం ఆయనకుంది. కానీ అప్పట్లో మా నాన్నకు ఎవరు లేరు. అందుకే లెజెండ్ అయ్యారు. సో నేను కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలి అంటే రిస్క్ చేయాలి.. అని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.

    English summary
    Manchu Vishnu, one of the senior most heroes in the Tollywood industry, did not receive much box office hits as a commercial. However he did not stop any of the attempts. Every once in a while he keeps testing his luck at the box office with a movie. And Next mosagallu is ready to hit a good hit with the movie anyway. However, Manchu Vishnu clarified that his father Mohan Babu was very dissatisfied with one thing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X