దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు..మా ఆధ్వర్యంలో సన్మానం!
హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానం ఛైర్మన్ బాధ్యతల్ని కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు స్వీకరించారు. నేడు (సోమవారం) పదవీ ప్రమాణ స్వీకారం వేళ పూజా కార్యక్రమాలతో దైవసన్నిధానం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబుకు అత్యంత సన్నిహితుడైన మహాభక్తుడు, కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు పాల్గొన్నారు.
అనంతరం ఈ సందర్భంగా మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మోహన్ బాబుకు ఘనంగా సన్మానం జరిగింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు సాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మా జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్, సురేష్, నాగినీడు, పసునూరి శ్రీనివాసులు, హరినాధబాబు తదితరులు పాల్గొన్నారు.



Click it and Unblock the Notifications











