కేసీఆర్‌కు సినీ నటుడు మెహన్ బాబు అభినందనలు

By Bojja Kumar

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతూ...తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సినీ నటుడు, నిర్మాత మెహన్ బాబు అభినందనలు తెలిపారు.

కేసీఆర్‌తో పాటు దేశ ప్రధాని కాబోతున్న బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీకి, సీమాంధ్రలో తిరుగులేని ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చంద్రబాబులకు మోహన్ బాబు అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసారు. ఫలితాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు.

 Mohan Babu personally congratulated Narendra Modi, KCR

మొదటి నుండి మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబం మోడీకి మద్దతుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మోడీ హైదరాబాద్ వచ్చినపుడు స్వయంగా వెళ్లి కలిసారు. ఈ నేపథ్యంలో ఆయన మెడీకి అభినందనలు తెలుపడంలో ప్రత్యేకత ఏమీ లేదు. అదే సమయంలో ప్రజల తీర్పును గౌరవిస్తూ కేసీఆర్, చంద్రబాబులకు అభినందనలు తెలుపడం గమనార్హం.

మోహన్ బాబు సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో యమలీల-2 చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు మరిన్ని చిత్రాలకు కూడా ఆయన కమిట్ అయ్యారు. నిర్మాతగా కూడా ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీలో తన మార్కు కొనసాగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X