మనోజ్ మైండ్ సెట్ మార్చే పనిలో మోహన్ బాబు...!?
తను పడిన కష్టం పిల్లలు పడవద్దని మోహన్ బాబు కోరుకుంటున్నాడట. మోహన్ బాబు నటన ప్రారంభ సమయంలో హీరోగా అవకాశాలు రాక, విలన్ వేషాలు వేస్తూ..అక్కడి నుండి హీరోగా మారాడు. ఈ విధంగా తన పిల్లలు చేయకుండా నేరుగా హీరోలుగానే చేయాలని మోహన్ బాబు ఆశపడుతుంటే మనోజ్ మాత్రం 'స్వయం కృషి" అంటున్నాడు..
మనోజ్ కు గత కొద్ది కాలంగా తగినన్ని సినిమా అవకాశాలు రాకపోవడంతో..తాను విలన్ గా కామెడీ క్యారెక్టర్లు కూడా చెయ్యడానికి సిద్దం అంటూ మీడియా ముందు చెప్పడంతో మోహన్ బాబుకు కోపం వచ్చి తర్వాత మనోజ్ కు క్లాస్ పీకాడని సమాచారం. వయసైపోతున్న తరుణంలో కూడా తాను హీరోగా నటిస్తుంటే, ఇంకా వయసులోనే ఉన్న మనోజ్ మాత్రం విలన్, కామెడీ వేషాలేస్తానంటున్నాడని మోహన్ బాబుని వేదిస్తోందట. ఎలాగైనా మనోజ్ కు ఈ ఆలోచన రాకుండా చేయడానికి ఓ భారి హిట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట మోహన్ బాబు. ఇదంతా చూస్తే..తండ్రి బాటలోనే కొడుకులు నడుస్తున్నారా?లేక తాము హీరోలం కాదు. విలన్లుగా కామెడీ నటులుగానే సరిపోతామని కొడుకులు నిర్ణయించేసుకున్నారా? అనే సందేహం అందరిలో మొదలయ్యింది.


Click it and Unblock the Notifications











