వాళ్లని తాకితే పోతుందా?...మోహన్ బాబు కొత్త వివాదం
హైదరాబాద్ : సినీ నటుడు మోహన్ బాబు ఈ మధ్య పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు స్వామీజీలను ఉద్దేశించి ఉండటమే ఇందుకు కారణం. ఇంతకీ మోహన్ బాబుకు వచ్చిన డౌట్ ఏంటని అనుకుంటున్నారా?

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామి రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 20 ఆలయాలకు చెందిన అర్చకులను విశాఖపట్నంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు, సినీనటులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు పలువురు స్వామీజీలకు పాదాభివందనం చేసారు. అయితే పాదాలను తాకాలని ప్రయత్నించిన మోహన్ బాబుకు సదరు స్వామీజీలు ఆ ఛాన్స్ ఇవ్వలేదట.
దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ...అనేక మంది స్వామీజీలకు పాదాభివందనం చేసేందుకు పాదాలను తాకాలని ముందుకు వంగితే వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. తాము అంటరానివారం కాదని... తాము ముట్టుకుంటే శక్తి పోతుందంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడిగినందుకు తనను వేరే విధంగా అనుకోవద్దని మోహన్ బాబు పీఠాధిపతులను కోరారు.


Click it and Unblock the Notifications











