రవీనా టండన్‌తో సాంగేసుకుంటున్న మోహన్ బాబు
మోహన్ బాబు, రవీణా టండన్లపై చిత్రీకరిస్తున్న పాటకు ప్రముఖ నృత్య దర్శకుడు రాజుసుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన రవీనా టండన్ చివరి సారిగా 'ఆకాశ వీధిలో' చిత్రంలో కనిపించింది. ఇప్పుడు మళ్లీ మోహన్ బాబు ద్వారా తెలుగు తెరపై రీఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో విష్ణు, మనోజ్‌లకు జోడీగా హన్సిక, ప్రణీత నటిస్తున్నారు. వరుణ్ సందేష్, తనీష్‌లు కూడా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ యూరఫ్ ఖండంలో మొదలైంది. ఇక్కడి వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతున్నారు. ముఖ్య తారాగణం అంతా షూటింగుల్లో పాల్గొంటున్నారు.
ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీమోహన్, కోన వెంకట్, బివిఎస్ రవి స్క్రిప్టు అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి, బప్పీ లహరి, ఆచ్చు, బాబా సెహగల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












