twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మోహన్ బాబు.. నన్ను అలా వివాదంలోకి లాగావు అంటూ

    |

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన ఆవేశపూరిత ప్రసంగం రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం రేపింది. సినిమా టిక్కెట్ల పెంపు, అలాగే ఏపీలో థియేటర్ల ఒపెనింగ్ అంశంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సినీ ప్రముఖులు, నటులు ఓ పొలిటిషియన్‌ను చూసి భయపడకూడదు అంటూ ఘాటుగా విమర్శించారు. తన ప్రసంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు మోహన్ బాబు కూడా పరిశ్రమ సమస్యలపై స్పందించాలని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

    వైఎస్ కుటుంబంతో మీకు అనుబంధం

    వైఎస్ కుటుంబంతో మీకు అనుబంధం

    సినిమా థియేటర్ల మూసివేత, టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మడానికి ఏపీ సర్కార్ చేస్తున్న వివాదంపై నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు మాట్లాడాలి అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. తమకు వైఎస్ కుటుంబీకులు మీకు బంధువులు. కాబట్టి ఆయనకు సభాముఖంగా ఓ విన్నపం చేస్తున్నాను. సినీ పరిశ్రమను హింసించ వద్దని వైఎస్ జగన్‌కు చెప్పండి. కావాలంటే పవన్ కల్యాణ్‌ను బ్యాన్ చేయమని చెప్పండి. మీరు మాజీ రాజ్యసభ సభ్యులు. మీకు నైతిక బాధ్యత ఉంది. సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాలి. ఈ రోజు సినిమాపై పరిశ్రమపై పెట్టిన ఆంక్షలు రేపు మీ విద్యాసంస్థలపై కూడా పెట్టడానికి అవకాశం ఉంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

    నా కంటే చిన్నవాడివి అంటూ..

    నా కంటే చిన్నవాడివి అంటూ..

    అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేసి స్పందించారు. నా చిరకాల మిత్రుడు చిరంజీవి సోదరుడైన పవన్ కల్యాణ్.. నీవు నా కంటే చన్నివాడివి. అందుకని ఏకవచనంతో సంబంధించాను. పవన్ కల్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు అని తన ప్రకటనలో తెలిపారు.

    మా ఎన్నికలు ముగిసిన తర్వాతే..

    మా ఎన్నికలు ముగిసిన తర్వాతే..

    మోహన్ బాబు విడుదల చేసిన తన ప్రకటనలో పవన్ కల్యాణ్ మాటలకు స్పందిస్తూ.. చాలా కాలానికి నన్ను మెల్లగా సినీ పరిశ్రమ వ్యవహారంలోకి లాగవు. అందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్ (మా) ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడే పూర్తిగా స్పందించలేను అంటూ కామెంట్ చేశారు.

    నా కొడుకు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు..

    నా కొడుకు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు..

    మా ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. ఆ విషయం నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి.ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతీ మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను అని పవన్ కల్యాణ్‌కు మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.

    Recommended Video

    Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || FIlmibeat Telugu
    విష్ణుబాబుకు ఓటు వేయండి అంటూ..

    విష్ణుబాబుకు ఓటు వేయండి అంటూ..

    ఇక మా ఎన్నికల ముగిసే సమయంలో నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లను గెలిపించాలని కోరుకొంటున్నాను. థ్యాంక్యూ వెరీ మచ్ అని మోహన్ బాబు తన లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Tollywood Senior Actor Mohan Babu reaction on Pawan Kalyan's speech at Republic pre release event. He said, I will respond to your comments after MAA Elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X