For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విష్ణుతో సన్నిలియోన్... ఫైర్ అయిన మోహన్ బాబు

  By Srikanya
  |

  ఇండో-కెనిడియన్ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ని తమ తాజా చిత్రం దేనికైనా రెడీలో పెట్టాలని యూనిట్ మొత్తం నిర్ణయించుకుంది. ఆమెకు అడ్వాన్స్ సైతం ఇవ్వటానికి రెడి అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు మండిపడ్డారు. హీరోయిన్ అంటే అలాంటి అలోచనలు చేయవద్దని సీరియస్ అయ్యారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సన్నిలియోన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకురావాలనే ఆలోచన ఈ విధంగా వెనకపడిందని సమాచారం. మొదటి హీరోయిన్ గా హన్సిక చేస్తున్న సంగతి తెలిసిందే.

  ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో షూటింగ్ సాగుతోంది. ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను మలుస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. క్లైమాక్స్, రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. విష్ణు ఈ చిత్రం గురించి చెబుతూ ''రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించేలా ఉంటుందీ చిత్రం. ప్రతి పాత్ర కావల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. నా కెరీర్‌లో ప్రత్యేకస్థానంలో నిలిచే సినిమా ఇది''అన్నారు. 'ఢీ' తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్‌లో నిలుస్తుందని విష్ణు తెలిపారు.

  ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ... ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి... వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

  ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌ బాబు.

  English summary
  'Denikainaa Ready' production house had almost finalized Sunny Leone's name as the second leading lady besides Manchu Vishnuvardhan. The makers also arranged for an advance of few lakhs while Sunny, on the other hand, was gearing to allot dates to the film. But with Mohan Babu's violent reaction, the production guys are now on the lookout for an alternative! 'Denikainaa Ready' is produced by G Nageshwara Reddy and is slated for a July release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X