Mohanbabu: అలా చేయడం అన్యాయమా? మీరే ఆలోచించండి ?

మంచు మోహన్ బాబు ఇంట రోజుకు కలహాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకు మనోజ్, విష్ణు, మోహన్ బాబు లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొన్న రాత్రి జర్నలిస్టుపై దాడి జరిగిన విషయం తెలిసింది. అయితే ఈ ఘటన జరిగినందుకు తాను ఎంతగానో చింతిస్తున్నట్లు మోహన్ బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆడియోలో మీడియాపై దాడిని వివరిస్తూ పలు విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏమన్నారో మీరూ కూడా ఓ లూక్కెయ్యండి..

'అందరికీ నమస్కారం.. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు ప్రజాప్రతినిధులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీడియా ప్రతినిధులకు, నా హృదయపూర్వక నమస్కారాలు. గత నాలుగు రోజులుగా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. నా హృదయ ఆవేదన ఏమిటంటే.. ఇది కుటుంబ సమస్య.. కుటుంబ సమస్యలు ఎవరైనా అనుమతి లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి' అని అన్నారు.

Mohan Babu released an emotional audio message about his family controversy and media attack

మోహన్ బాబు మాట్లాడుతూ.. 'ప్రతి కుటుంటంలో ఏదొక సమస్య ఉంటుంది. మేమంత నటులం, పాపులారిటీ ఉన్న వాళ్లం కాబట్టి కొంతమంది ఉన్నవి లేని చెబుతూ ఉంటారు. చెప్పేవాళ్లు కూడా ఆలోచించాలి. ఇదొక కుటుంబ సమస్య అనీ, ఈ విషయం ప్రజలకు తెలుసు. కానీ,మనకు అవసరలేదనీ వారి పనులు వారు చేసుకుంటున్నారు. కానీ, ఈ సమస్యపై ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి సోషల్ మీడియాలో వస్తున్న విజ్యూవల్ చూడండి. రాత్రి ఎన్ని గంటలకు నా ఇంటి గేట్ తోసుకుని లోపలికి వచ్చారు' అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

'పత్రికాధిపతులు, పత్రిక సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులు పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేనప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను. అందరికీ నమస్కారం అయ్యా. మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు. దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను. ఈ విషయాన్ని సిలువలు పలువలు చేయకండి. దయచేసి నన్ను గౌరవించండి. నేను ప్రజల కోసం ఏం చేస్తున్నాను. ఓ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై క్లీన్ చీటితో బయటకు వచ్చిన వ్యక్తిని, ఓ నటుడిగా నేనేంటో అందరికి తెలుసు ' అంటు బాధపడ్డారు.

'నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పాలి. ఈరోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగిటివ్ స్పేర్డ్ చేస్తున్నారో అందరికీ తెలుసు. దానికి నేను భయపడటం లేదు. రాత్రుల్లో గేటు పగలగొట్టి.. పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. వచ్చినవాళ్లు అందరూ మీడియా సోదరులా? లేకపోతే ఎవరైనా నా మీద పగద్వేషాలతో ఉన్న వాళ్ల అనే విషయం నాకు ఎలా తెలుస్తోంది? మీడియా మిత్రులను కొట్టాలని, లేదా తిట్టాలని గాని నాకు ఎలాంటి దుర్దేశం లేదు' అంటూ మోహన్ బాబు వివరణ ఇచ్చారు.

Mohan Babu released an emotional audio message about his family controversy and media attack

'నేను అందరికీ నమస్కారం పెట్టాను. అయినా చెప్పిన వినకుండా.. అతనిపై మైకు పెట్టాడు. వాస్తవానికి అలా చేయడంతో నా కన్ను పోయేది. తప్పించుకున్నా.. మైకు లాక్కోవడం. వాడు నాపై కేకలేయుడంతో ఘర్షణ జరిగింది నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని పేర్కొన్నారు. నా చేతులో గాయపడిన వ్యక్తి గురించి హృదయపూర్వక ఎంతో బాధపడుతున్నాను. ఆ వ్యక్తి గురించి నేను చింతిస్తున్నాను. అతని భార్య, పిల్లలు ఎంత బాధ పడుతున్నారోననీ, నేనెంత ఆవేదనకు గురిఅవుతున్నాను. ఆ దాడిలో నేను కూడా ఆస్పత్రిలో చేరాను. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నేను ధైర్యం, సాహసం, నీతి, న్యాయంగా, ధర్మంగా బ్రతుతాను అని పేర్కొన్నారు.

'నేను చేసింది తప్పే. కానీ, ఇంట్లోకి చొరబడి, నా ఏకాగ్రతను, నా మనశాంతిని భగ్నం చేసాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు. నా కుటుంబ సమస్యలను నేను పరిష్కరించుకుంటాను. ఇలా చేయండి అలా మాట్లాడమని చెప్పక్కర్లే . నేను కట్టు బట్టలతో బయటకు వచ్చాను. ఒక పైసా ఒక పైసా నా కష్టార్జితతో సంపాదించాను. ఈ రోజు నేను కులం, మతం అనే తేడా లేకుండా నా విద్య సంస్థల్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్స్ అందిస్తున్నా. నా అభిమానులారా.. తెలుగు ప్రజలారా.. తమిళ, మలయాళ, కన్నడ అభిమానులారా ..ఓ సారి ఆలోచించండి' అని విన్నవించారు.

'నేను చేసింది తప్పే . కానీ ఏ సందర్భంలో కొట్టాల్సిది వచ్చింది. మీ ఇంట్లో ఇలాంటి సందర్భంలో పరాయి వాళ్ళు దూరితే మీరు ఒప్పుకుంటారా..? మీ ఏకాగ్రతను భంగం చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి? న్యాయాధిపతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, మీడియా ప్రతినిధులారా మీ ఇండ్లలో ఎవరైనా ఇలా దూరి.. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకుంటారా?' అని మోహన్ బాబు ప్రశ్నించారు.

'ఆ రాత్రి నా ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. జర్నలిస్టా..? పరాయి వ్యక్తా? అనేది నాకు ఎలా తెలుస్తుంది. అక్కడ ఏం జరిగిందో భగవంతుడు చూస్తున్నాడు. ఈ సమస్యపై మీరే ప్రజలారా చూడండి. ఆలోచించండి. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమే? మీరే చెప్పండి . ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు' అంటూ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X