twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా టికెట్ల వివాదంలోకి పెదరాయుడు ఎంట్రీ.. కీలక ప్రకటన.. రేపు ఏం జరగనుందో?

    |

    గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మధ్య టికెట్ రేట్ల విషయం మీద వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచాలని... టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు డిమాండ్ చేస్తూనే ఉన్నా ఏపీ ప్రభుత్వం అయితే టికెట్ రేట్లు పెంచేట్టు ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఈ వ్యవహారంలో మోహన్ బాబు దిగుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    నిమ్మకు నీరెత్తినట్లు

    నిమ్మకు నీరెత్తినట్లు

    గత కొన్ని రోజులుగా ఏపీ టికెట్ రేట్లు విషయం మీద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టికెట్ల విషయంలో తాము వెనకడుగు వేసేది లేదంటూ జగన్ సర్కార్ చెబుతోంది. దీంతో కడుపుమండిన పవన్ కళ్యాణ్, హీరో నాని, సిద్ధార్థ వంటి వాళ్లు విమర్శలు చేశారు. థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగుందని నాని విమర్శలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా నాని మీద విరుచుకు పడింది.

    ఇండస్ట్రీ పెద్దని నేను కాద

    ఇండస్ట్రీ పెద్దని నేను కాద


    అయితే జగన్ సర్కార్ తో సంప్రదింపులు జరిపి సినిమా టికెట్ రేట్లు పెంచే ప్రయత్నం చేయడానికి చిరంజీవి, సురేష్ బాబు, దిల్ రాజు వంటి వారు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే విసిగిపోయారో ఏమో తెలియదు కానీ ఇండస్ట్రీ పెద్దని నేను కాదని చిరంజీవి పేర్కొన్నారు. అది జరిగిన కాసేపటికే ఈ విషయం మీద డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    కీలక ప్రకటన

    కీలక ప్రకటన

    ఇప్పటివరకు టికెట్ల ధరల విషయంపై స్పందించని మోహన్ బాబు తాజాగా ఈ వ్యవహారం పై కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్ల వ్యవహారం పై రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. టికెట్ల ధరలు పెంచాలని ఈ సందర్భంగా మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    కృష్ణ సన్మాన కార్యక్రమంలో

    కృష్ణ సన్మాన కార్యక్రమంలో

    హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన సూపర్ స్టార్ కృష్ణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాస్తారని అంటున్నారు. విలేకరుల సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి, తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేస్తారని చెబుతున్నారు. ఈ మీడియా సమావేశంలో మోహన్ బాబు ఈ లేఖను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి వైఎస్-మోహన్ బాబు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. జగన్ బాబాయ్ కూతుర్నే విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

    Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
     సినీ పరిశ్రమకు అనుకూలంగా

    సినీ పరిశ్రమకు అనుకూలంగా

    2019 సార్వత్రిక ఎన్నికల్లో మోహన్ బాబు వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు రంగంలోకి దిగితే ఖచ్చితంగా సినీ పరిశ్రమకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క సినిమా టికెట్ ధరల పై ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కన్వీనర్‌గా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు , ఛాంబర్ ప్రతినిధులు, సినీ గోయర్స్‌తో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ నిర్ణయం మేరకు ధరల సవరణ చేయనున్నారని అంటున్నారు.

    English summary
    Mohan Babu Responds on Andhra pradesh Movie Ticket Controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X