ట్రోల్స్‌పై మోహన్ బాబు ఫ్యామిలీపై సీరియస్.. పరువు తీస్తే పరువు నష్టం దావా.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు కొంత కాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రోల్స్ వెనుక ఇద్దరు హీరోలు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆ విషయం మీద మంచు ఫ్యామిలీ సీరియస్ అయింది. తమ మీద ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళితే

'సన్ ఆఫ్ ఇండియా'
మోహన్ బాబు చాలా కాలం తరువాత 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన "సన్ ఆఫ్ ఇండియా" సినిమాకు డాక్టర్ మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే కూడా అందించారు. ఈ సినిమాలో శ్రీకాంత్,తనికెళ్ల భరణి,అలీ,వెన్నెల కిషోర్,ఫృథ్వీరాజ్,రఘుబాబు,రాజా రవీంద్ర, లాంటి వారు కీలక పాత్రలు పోషించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించడంతో సినిమాకు మరింత ప్లస్ అయింది.

బాధపడక తప్పదు
ఈ సినిమా ప్రొమోషన్ కార్యక్రమాలలో భాగంగా మొన్నీమధ్య మోహన్ బాబు తనపై వస్తున్న ట్రోలింగ్స్‌పై స్పందించారు. ట్రోలింగ్, వ్యంగంగా వచ్చే మీమ్స్ చూసి చాలా బాధపడుతున్నానని అన్నారు. అసలు వాటిని దృష్టిలోకి తీసుకోవలసిన అవసరం లేదు కానీ మనిషిగా పుట్టినందుకు ఆత్మాభిమానం ఉంటుంది కదా కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడక తప్పదు అని కూడా చెప్పుకొచ్చారు.

పంపిస్తే చూస్తా
సెలబ్రిటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ క్రియేషన్ చాలా బాధ కలిగిస్తుందన్న ఆయన ఎదుటి వారి మీద ట్రోలింగ్ చేయవచ్చేమో నాకు తెలీదు కానీ.. అందులో వ్యంగ్య ధోరణి మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని కూడా అన్నారు. మామూలుగా అయితే నేను వాటిని చూడను కానీ ఎవరైనా పంపిస్తే చూస్తా అని, అదే పని మీద కూర్చుని చేసేవాళ్లు కూడా కొందరున్నారని తెలిసిందని, వారికి అదే ఉద్యోగం అని అన్నారు.

హెచ్చరిక జారీ
అలాగే అప్పుడు ఒక ఇద్దరు హీరోలు 50 నుంచి 100 మందిని అపాయింట్ చేసుకుని ఇలా ప్రతి ఒక్కరినీ ట్రోల్ చేయిస్తున్నారని కుడి ఆరోపించారు. ఈ ట్రోల్స్, మీమ్స్ సరదాగా నవ్వుకునేలా ఉండాలి కానీ ఎదుటి వాడి పతనం కోరుకునేలా ఉండకూడదు అని అన్నారు. అయితే సినిమా విడుదల అయినా తరువాత కూడా భారీగా ట్రోలింగ్ జరుగుతోన్న క్రమంలో ఆ ట్రోలర్స్‌కు ఓ విధమైన హెచ్చరిక జారీ అయ్యింది.

పది కోట్ల పరువు నష్టం
మంచు విష్ణుకు చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తరఫున ఆ కంపెనీకి చెందిన శేషు కుమార్ అనే ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రోల్స్ మీద ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా సైట్స్‌లో మంచు ఫ్యామిలీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని ఫిర్యాదులో కోరారు. ఒకవేళ ట్రోలర్స్ మీద చర్యలు తీసుకోవడం ఆలస్యం అయితే మంచు ఫ్యామిలీ మెంబర్స్ మీద పర్సనల్ ఎటాక్ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు రూ. పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా వేస్తామని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











