»   »  'మామ మంచు అల్లుడు కంచు' ఫస్ట్ లుక్ (పోస్టర్)

'మామ మంచు అల్లుడు కంచు' ఫస్ట్ లుక్ (పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మంచు మామకి కంచు లాంటి అల్లుడొస్తే ఆ కితకితలు ఎలా ఉంటాయో తెరపైనే చూడాలంటున్నారు మోహన్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు అల్లుడు కంచు'. రమ్యకృష్ణ, మీనా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అల్లరి నరేష్‌, పూర్ణ జంటగా నటిస్తున్నారు. మంచు విష్ణు నిర్మాత. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

నిర్మాత మాట్లాడుతూ ''నాన్నగారు హీరోగా నటిస్తున్న 181వ చిత్రమిది. రమ్యకృష్ణ, మీనాతో కలిసి నాన్న చేసిన 'అల్లరి మొగుడు' ప్రేక్షకాదరణ పొందింది. ఆ ముగ్గురు ఒక మంచి కలయిక అనిపించుకొన్నారు. ఇప్పుడు వారికి అల్లరి నరేష్‌ కూడా తోడయ్యారు. ఆయనకిది 50వ చిత్రం. ఆసక్తికరమైన కలయికలో ఒక మంచి కుటుంబ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పాట మినహా మొత్తం పూర్తయింది. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై వరుసగా విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్న మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాత. ఈ మధ్యకాలంలో సినిమాకి కీలకంగా నిలిచే పాత్రలు చేసిన మోహన్ బాబు ఫుల్ లెంగ్త్ హీరోగా చేయబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది.

Mohan Babu's Mama Manchu Alludu Kanchu first look out

వరుణ్‌సందేశ్‌, అలీ, కృష్ణభగవాన్‌, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖావాణి, హృదయ, మౌనిక, ధనరాజ్‌ తదితరులు నటిస్తున్నారు. మాటలు: శ్రీధర్‌ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, సంగీతం: అచ్చు, రఘు కుంచె.

English summary
Mohan Babu, Allari Naresh's upcoming multistarrer ‘Alludu Kanchu Mama Manchu’ is progressing at brisk pace under the direction of Sreenivas Reddy of ‘Damarukam’ fame.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu