»   » అల్లరి నరేష్ 'మామ మంచు అల్లుడు కంచు' ట్రైలర్

అల్లరి నరేష్ 'మామ మంచు అల్లుడు కంచు' ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మోహన్‌బాబు, అల్లరి నరేశ్‌, రమ్యకృష్ణ, మీన, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మామ మంచు అల్లుడు కంచు'. ఈ చిత్రం ఆడియోను నవంబర్‌ 28న విడుదల చేసారు. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 25న 'మామ మంచు అల్లుడు కంచు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.


24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పైన మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విన్నవారు బాగుందంటున్నారు.


మోహన్‌బాబు మాట్లాడుతూ ''శ్రీనివాసరెడ్డి మంచి దర్శకుడు. ఒక కథ అతని చేతికిస్తే అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కిస్తాడు. ఇలాంటి దర్శకుడు మరిన్ని సినిమాలు చేయాలి. ఒక్క నిమిషమూ వృథా చేయకుండా పనిచేశాం.'అల్లరి మొగుడు' లాంటి సినిమాలో నటించడం తన అదృష్టం అని చెబుతుంటుంది రమ్యకృష్ణ.


కానీ ఆ సినిమాలో నేను నటించడం నా అదృష్టమేమో. రమ్యకృష్ణ వల్లే ఆ సినిమా బాగా ఆడిందేమో. అప్పట్లో ఎవరైతే కాదన్నారో వాళ్లే ఇప్పుడు రమ్యకృష్ణ డేట్ల కోసం వెంటపడుతున్నారు. మీనా, రమ్యకృష్ణతో చాలా కాలం తర్వాత నటించా. వాళ్లిద్దరూ నాకు బంగారం. ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలు రెండు మూడు సంవత్సరాలకే తిరిగి వెళ్లిపోతున్నారు. మీనా, రమ్యకృష్ణ ఇప్పటికీ అలాగే ఉన్నారు.


Mohan Babu's Mama Manchu Alludu Kanchu trailer

'మామ మంచు...'లో నటించిన అల్లరి నరేష్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈవీవీ సత్యనారాయణ అంటే నాకు ఇష్టం. అతనితో రెండు సినిమాలు చేశాను. చాలామంది హాస్యనటుల్ని ఆయన పైకి తీసుకొచ్చారు. వాళ్లబ్బాయి నరేష్‌ 50 సినిమాలు చేశాడు. తను సమయానికి సెట్‌కు రాడు.. ఎందుకొచ్చిన గొడవ అన్నారు చాలామంది. నరేష్‌ మాత్రం ఎప్పుడడిగితే అప్పుడొచ్చాడు.


నటుడిగా నేను 500 సినిమాలు చేశా. నరేష్‌ నా కంటే ఎక్కువ సినిమాలు చేయాలి. విష్ణు, మనోజ్‌లా నరేష్‌ కూడా నా కొడుకులాంటివాడే. ఏ సన్నివేశంలోనూ నన్ను డామినేట్‌ చేయలేదు. సినిమా చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంద''న్నారు.


డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా,సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న,దాసన్న, అంబటి శీను ఇతర తారాగణంగా నటించారు.


ఈ చిత్రానికి మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్,విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

English summary
Mohan Babu and Allari Naresh's Mama Manchu Alludu Kanchu trailer released. They are planning to release the film on Christmas day i.e. on December 25.
Please Wait while comments are loading...