మోహన్ బాబు తల్లి కన్నుమూత.. విదేశాల నుంచి హుటాహుటిన!
ప్రముఖ నటుడు మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ(85) గురువారం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో భాదపడుత్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లక్ష్మమ్మ చికిత్స పొందుతూ మరణించారు. మోహన్ బాబు, అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు.
గురువారం తన తల్లి మరణవార్త తెలియగానే మోహన్ బాబు హుటాహుటిన బయలుదేరినట్లు తెలుస్తోంది. లక్ష్మమ్మ మృత దేహాన్ని మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు తరలించారు.

శుక్రవారం లక్ష్మమ్మ పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె అంత్యక్రియలకు పలువురు సినీ సెలెబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
mohan babu manchu lakshmamma manchu manoj manchu vishnu manchu lakshmi మోహన్ బాబు మంచు లక్ష్మమ్మ మంచు మనోజ్ టాలీవుడ్


Click it and Unblock the Notifications