మోహన్‌బాబు ‘పద్మశ్రీ’రద్దుకై రాష్ట్రపతికి లేఖ
హైదరాబాద్ : మోహన్‌బాబుకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఈమేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాసినట్లు ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ బ్రాహ్మణ జాగృతి చైర్మన్ డాక్టర్ పీ కమలాకర్‌శర్మ మీడియాకు తెలియచేసారు. భారతీయ సం స్కృతి, సంప్రదాయాలను బోధించే బ్రాహ్మణులపై రౌడీలతో దాడి చేయించిన 'దేనికైనా రెడీ' చిత్ర నిర్మాత మోహన్‌బాబు, హీరో విష్ణువర్ధన్‌బాబులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీసి, దురుసుగా వ్యవహరిస్తున్న మోహన్‌బాబు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే బ్రాహ్మణుల క్షోభ తగులుతుందని అన్నారు. ఈ సమావేశంలో ధన్వంతరీ ఫౌండేషన్ మేనేజర్ వీఎస్ రావు, తెలంగాణ అఖిల బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు మురళీధర్ దేశ్‌పాండే, ఫౌండేషన్ ప్రతినిధులు కైలాష్‌శర్మ, సురేశ్‌శర్మ, గోవింద్ మాడీ, గాయా ప్రసాద్, కండెల్‌వాల్ తదితరులు పాల్గొన్నారు.
మరో ప్రక్క మోహన్ బాబు...'దేనికైనా రెడీ' రూపంలో విష్ణుకు ఓ విజయం లభించడం ఆనందంగా ఉందని, ఈ చిత్రం వివాదం ప్రస్తుతానికి కోర్టులో ఉన్నందున దీనిపై వ్యాఖ్యలు చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తనకు అన్ని మతాలు, కులాలు అంటే గౌరవం ఉందని, ముఖ్యంగా వేదపండితులు, బ్రాహ్మణులు అంటే తనకు చాలా గౌరవమని చెప్పారు. అంతేకాకుండా 'దేనికైనా రెడీ' సినిమా చూసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని బహిరంగ ప్రకటన చేశానని, దీనిపై ఎవరూ స్పందించలేదని మోహన్‌బాబు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏదిఏమైనా జరిగిన సంఘటనలకు బాధపడుతున్నానని, ఇలా జరగడం దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నానని ఆయన వెల్లడించారు.
కాగా, దేనికైనా రెడీ సినిమాపై ప్రభుత్వం వేసిన కమిటీపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మోహన్ బాబుకు కాస్తా ఊరట లభించినట్లయింది. అయితే, ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వెంటనే పిటిషన్ దాఖలైంది. దేనకైనా రెడీ సినిమమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.


Click it and Unblock the Notifications











