»   » పవన్ కళ్యాణ్ మంచోడు, చిరుపై మోహన్ బాబు నో కామెంట్

పవన్ కళ్యాణ్ మంచోడు, చిరుపై మోహన్ బాబు నో కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ బాబు, అల్లరి నరేష్ కలిసి నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు' చిత్రం విడుదల సందర్భంగా మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అల్లరి నరేష్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సరైన కథ దొరికితో తన కూతురు లక్ష్మితో కలిసి చేస్తానని చెప్పారు. పవన్ కళ్యాన్ మీద మీ అభిప్రాయం ఏమిటి ? అని అడగ్గా.... ‘హి ఈజ్ ఎ గుడ్ మ్యాన్' అంటూ సమాధానం ఇచ్చారు.


రజనీకాంత్ గురించి ఒక్కముక్కలో చెప్పండి అనే ప్రశ్నకు స్పందిస్తూ...‘గుడ్ ఫ్రెండ్' అని సమాధానం ఇచ్చారు. చిరంజీవితో టామ్ అండ్ జెర్రీ రిలేషన్ షిప్ ఉందా? అనే ప్రశ్నపై మాట్లాడటానికి మోహన్ బాబు నిరాకరించారు. ఈ మధ్య కాలంతో తనకు బాగా నచ్చిన సినిమా ‘శ్రీమంతుడు' అని తెలిపారు.


Mohan Babu says..Pawan Kalyan is a Good Man

ఇక ఈ తరం నటుల్లో తన అభిమాన నటులు తన ఇద్దరు కొడుకులే అని మోహన్ బాబు చెప్పడం గమనార్హం. దర్శకత్వం వహించే తప్పు ఎప్పటికీ చేయను అని మోహన్ బాబు తేల్చి చెప్పారు. తనకు బాగా నచ్చిన హాలీవుడ్ మూవీ ‘ఫిడ్లెర్ ఆన్ ది రూఫ్' అని తెలిపారు.


మహేష్ బాబు గురించి మీ అభిప్రాయం ఏమిటని కోరగా...‘టాలెంటెడ్ యాక్టర్ అండ్ హంబుల్ హ్యూమన్ బీయింగ్' అని సమాధానం ఇచ్చారు. జూ ఎన్టీఆర్ గురించి.....‘హి ఈజ్ షూర్లీ ఎ ఫైన్ యాక్టర్' అని తెలిపారు. తాను నటించిన అసెంబ్లీ రౌడీ ఇపుడు రీమేక్ చేస్తే ఏ హీరో బాగా సూటవుతారు? అని అడగ్గా....విష్ణు అని సమాధానం ఇచ్చారు.


దాసరి తర్వాత మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అని అడగ్గా ‘మై బ్రదర్ శ్రీ కె. రాఘవేంద్రరావు' అని తెలిపారు. రాజకీయాల ద్వారా సేవ చేయడం అసాధ్యమని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. విద్యానికేతన్ ద్వారా ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

English summary
Ahead of 'Mama Manchu Alludu Kanchu' release, Mohanbabu held an interactive session with fans on Twitter. Here are some of the interesting Q&As.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu