twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముడ్డిమీద తన్నాలి, నిరూపిస్తే కాల్చుకుని చనిపోతా, ఆ హీరోయిన్ అనుభవిస్తోంది: మోహన్ బాబు

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mohan Babu Open Challenge To Film Industry

    తెలుగు చిత్ర పరిశ్రమలో 43 సంవత్సరాల సుధీర్ఘ అనుభం కలిగిన నటుడు మోహన్ బాబు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి టాలెంటుతో ఎదిగారు. విలనిజం, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల స్థాయి నుండి హీరోగా, నిర్మాతగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. మోహన్ బాబు అంటే డిసిప్లెన్, డిసిప్లెన్ అంటే మోహన్ బాబు అనే పేరు తెచ్చుకున్నారు. మోహన్ బాబు కాంపౌండులో స్ట్రిక్ట్ రూల్స్‌ కారణంగా ఆయనతో చేయడానికి భయపడే వారు చాలా మంది ఉన్నారు. తాజాగా మోహన్ ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు, తనపై వయస్తున్న కొన్ని ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చారు.

    నాపై దుష్ప్రచారం చేశారు

    నాపై దుష్ప్రచారం చేశారు

    ‘నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చి కొంతమంది హీరోలు నా గురించి ఇండస్ట్రీలో చెడుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా హీరోయిన్లకు నా గురించి ఏదో చెప్పి భయపెట్టేవారు. దీంతో కొందరు హీరోయిన్స్ నాకు ఇచ్చిన డేట్స్ ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. వారి మాటలు పట్టించుకోకుండా నాతో నటించిన మంచి హీరోయిన్లు కూడా ఉన్నారు అని.... అని మోహన్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    అదే నేను చేసిన పెద్ద తప్పు

    అదే నేను చేసిన పెద్ద తప్పు

    నటుడిగా 42 సంవత్సరాలు నా కెరీర్లో నేను చేసిన తప్పేమిటంటే సెక్రటరీని పెట్టుకోకపోవడమే. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఇలా అన్నిస్థాయిల్లోనూ నా డేట్స్ నేనే చూసుకునే వాడిని, అదే నేను చేసిన పెద్ద తప్పు. సెక్రటరీని పెట్టుకుని ఉంటే నిర్మాతలను నిలబెట్టి నాకు రావాల్సిన డబ్బు అడిగేవాడు, మా హీరోకు ఆ హోటల్ ఫుడ్ కావాలి, ప్రత్యేకంగా కారు కావాలని అడిగే వాడు, నిర్మాత తిట్టుకుంటూనో, నొచ్చుకుంటూనో ఏర్పాటు చేసేవాడు... అని మోహన్ బాబు అన్నారు.

    నేను అలా చేయడంతో రఫ్‌ అనేవారు

    నేను అలా చేయడంతో రఫ్‌ అనేవారు

    ఇన్నేళ్ల కెరీర్లో నేను సెక్రటరీని పెట్టుకోలేదు. నా కార్లో నేనే వస్తాను, నా భోజనం నేనే తెప్పించుకుంటాను అనేవాడిని. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదని అడిగేవాడిని. దాంతో రఫ్ గా మాట్లాడతానని అనుకునేవారు. అందుకే సెక్రటరీని పెట్టుకోమని మా పిల్లలకు కూడా చెబుతుంటాను.. అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

    నన్ను పెట్టుకునే అదృష్టం లేదు అనే పదం నేను అనను

    నన్ను పెట్టుకునే అదృష్టం లేదు అనే పదం నేను అనను

    మీరంటే ఇప్పటి యంగ్ జనరేషన్ డైరెక్టర్లు భయపడుతున్నారు అనే ప్రశ్నకు మోహన్ బాబు స్పందిస్తూ.....వాళ్లకు నా మీద ఇష్టం లేక పోవచ్చు. వారి సినిమాల్లో నాకు క్యారెక్టర్ లేక పోవచ్చు. వాళ్లకు నన్ను పెట్టుకునే అదృష్టం లేదు అనే పదం మాత్రం నేను అనను. నేను అంటే ఎందుకు భయం. ఏం భయం అనేది భయపడే వారినే అడగాలి. నీకు 7 గంటలకు షూటింగ్ అంటే ఆరున్నరకే వస్తాను. ఒక సినిమాకు ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు... అని మోహన్ బాబు తెలిపారు.

    రాజమౌళి, పూరికి లేని భయం మీకెందుకు?

    రాజమౌళి, పూరికి లేని భయం మీకెందుకు?

    నా సిన్సియారిటీ చూసి, నా డిసిప్లెన్, నా పద్దతులు చూసి భయం క్రియేట్ అయిందేమో? రాజమౌళి యమదొంగ అద్భుతంగా తీశాడు, నన్ను ప్రేమించాడు. పూరి గన్నాథ్ కూడా నాతో సినిమా చేశాడు. ప్రేమించాడు. నేను దర్శకుడికి ఎంత గౌరవం ఇస్తానో వారు చెప్పారు కూడా, మరి ఎందుకు భయపడటం.... అని మోహన్ బాబు వ్యాఖ్యనించారు.

    నా ఇంటికి పిలిచి విస్కీ పోయాలా?

    నా ఇంటికి పిలిచి విస్కీ పోయాలా?


    ఫ్రెండ్లీ అట్మాస్పియర్ క్రియేట్ చేయడం ఏమిటి? పిలిచి మందు పోయాలా? క్లబ్బుకు తీసుకెళ్లాలా? నా ఇంటికి పిలిచి రోజూ విస్కీ పోయాలా? ఢిల్లీ తీసుకెళ్లాలా? బాంబే తీసుకెళ్లాలా? ఎందుకు భయపడుతున్నారో వారినే అడగాలి.... అని మోహన్ బాబు ప్రశ్నించారు.

    దర్శకుడు సూర్యకిరణ్ పై మీరు చేయి చేసుకున్నారట?

    దర్శకుడు సూర్యకిరణ్ పై మీరు చేయి చేసుకున్నారట?

    దర్శకుడు సూర్యకిరణ్ పై మీరు చేయి చేసుకున్నారట? కదా అనే ప్రశ్నకు మోహన్ బాబు స్పందిస్తూ..... 'ఈ రోజున సూర్య కిరణ్ ఆ మాట చెబితే మీకు నా యావదాస్తిని ఇచ్చేస్తాను. ఒకవేళ సూర్య కిరణ్ అలాంటిదేం లేదంటే మీరేమిస్తారో చెప్పండి' అంటూ మోహన్ బాబు ఎదురు ప్రశ్నించారు. నా గురించి అలా అనుకుంటున్నారంటే "ఇలాంటివన్నీ మూర్ఖులు అనుకుంటూ ఉంటారు, బుర్ర పనిచేయని వాళ్లు అనుకుంటారు. నా దృష్టిలో దర్శకుడు రథసారథి వంటివాడు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

    ఆ హీరోయిన్ అనుభవిస్తోంది

    ఆ హీరోయిన్ అనుభవిస్తోంది

    కొందరు హీరోయిన్‌ను కొట్టాను అంటారు. కొట్టానా? కేకలేసానా? అనేది నాకు తెలుసు, సెట్లో ఉన్న దర్శకుడికి, అక్కడున్న అందరికీ తెలుసు. టైమ్ ప్రకారం రానపుడు, నా దర్శకుడిని అగౌరవంగా మాట్లాడినపుడు కేకలేస్తాను. నా దృష్టిలో దర్శకుడు రథసారధి, సెట్లో దర్శకుడు చెప్పినట్లు యాక్ట్ చేశామా.. వెళ్లి పోయామా.. అన్నట్లు ఉండాలి. అక్కడ నీకు తిట్టే అధికారం లేదు. ఆమె బిహేవియర్ వల్ల ఇపుడు అవకాశాలు లేక భోజనానికి కూడా సఫర్ అవుతోందట. ఈ జన్మలో చేసుకున్న పాపం వారు ఇక్కడే అనుభవిస్తారు....అని మోహన్ బాబు తెలిపారు.

    అలాంటి వారిని ముడ్డిమీద తన్నాలి

    అలాంటి వారిని ముడ్డిమీద తన్నాలి

    నాకు ఉన్న పెద్ద వీక్ నెస్ సెట్లో ఎవరైనా డిసిప్లెన్‌గా లేకుంటే భరించలేను. సెట్‌కు వచ్చి ఫోన్ మాట్లాడ కూడదు. ఏ ఆర్టిస్టైనా సెట్లో ఏం చేయాలో అదే చేయాలి. డైలాగ్ ఎలా చెప్పాలి, టైమింగ్ సరిగా ఉందో చూసుకోవాలి, ఈ షాట్ తర్వాత నెక్ట్స్ షాట్ ఏమిటనే దాని గురించి ఆలోచించాలి. సెట్లో పేకాడటం లాంటివి చేస్తే నచ్చదు. అది ఎవరి తప్పు అంటే దర్శకుడి తప్పు. అలాంటి వారిని ముడ్డిమీద తన్నాలి. కళామతల్లిని గౌరవించాలి అని నేను చెబుతున్నాను. నువ్వు ఏదైనా ఇన్ఫోసిస్ లాంటి కంప్యూటర్ కంపెనీకి వెళ్లి పేకాడితే ఊరుకుంటారా? రాజ్యసభలో ఆడతావా? అసెంబ్లీలో ఆడతావా? నీ ఇంట్లో ఐదు మంది పనోళ్లను పెట్టుకుంటావు వారు పని చేయకుండా పేకాడితే ఊరుకుంటావా? ఒప్పుకున్నపుడు నువ్వు అసమర్ధుడివి, అలాగే కొంత మంది అసమర్ధులు ఇండస్ట్రీలో ఉన్నారు.... అని మోహన్ బాబు తెలిపారు.

    పేకాడితే టేబుల్ తన్నాను

    పేకాడితే టేబుల్ తన్నాను


    నా సెట్లో పేకాడితో ఓ సందర్భంలో నేను వెళ్లి కాలుతో టేబుల్ తన్నితే అది పైకి ఎగిరి పక్కన ఉన్నవారి మీద పడింది. ఆ తర్వాత నన్ను అడిగేవారు, సార్ మాకు గంట వరకు షూటింగ్ లేదట అటు వెళ్లి ఆడుకోవచ్చా అని, ఒకే మీ ఇష్టం అనేవాడిని కానీ సెట్లో మీ అసిస్టెంట్ ఉండాలి, షాట్ రెడీ అయితే మీ అసిస్టెంటుకు మా అసిస్టెంట్ డైరెక్టర్ చెబుతాడు వారు నిన్ను వచ్చి పిలవాలి అని చెప్పేవాడిని.... అని మోహన్ బాబు తెలిపారు.

    మీ ముందే కాల్చుకుని చనిపోతా

    మీ ముందే కాల్చుకుని చనిపోతా

    మోహన్ బాబు సెటిల్మెంట్లు, రౌడీయిజం చేసి పైకొచ్చారు అనే ఆరోపణలపై స్పందిస్తూ.... ఈ ప్రశ్న వేసినందుకు సంతోషంగా ఉంది, కానీ ఒక్కటి నిరూపించినా మీ ముందే కాల్చుకుని చనిపోతా, ప్రూవ్ చేయకపోతే మీరేం చేస్తారో కూడా చెప్పాలి. ఆ వ్యక్తి మోహన్ బాబు మా దగ్గర అన్యాక్రాంతంగా ఒక రూపాయి తీసుకున్నారని చెప్పినా, ఇలా రౌడీయిజం చేశాడని చెప్పినా నేను రెడీ. రౌడీ అంటే ఎవరు? మీరూ రౌడీనే నేనూ రౌడీనే. మన స్కిల్ మనం కాపాడుకోవాలనుకున్నపుడు తిరగబడేవాడే రౌడీ. దాన్ని కాపాడుకోకపోతే అసమర్థులం అవుతాం. దైవ సాక్షిగా, పంచ భూతాల సాక్షిగా చెబుతున్నాను. ఏం భయపడాల్సిన అవసరం లేదు, నిరూపించండి... అంటూ మోహన్ బాబు సవాల్ విసిరారు.

    ఎవరికీ అన్యాయం చేయలేదు

    ఎవరికీ అన్యాయం చేయలేదు

    నేను పర్ఫెక్ట్‌గా ఇన్ కంటాక్స్ కడతాను. సినిమా పరంగా ఎవరి వద్ద అయినా డబ్బు అప్పు తీసుకుంటే గౌరవ ప్రదంగా ఇంట్రెస్టుతో తిరిగి ఇచ్చేస్తుంటాను. ఎవరికీ రూపాయి ఎగ్గొట్టలేదు అని మోహన్ బాబుత తెలిపారు.

    దాసరి గారికి, పరిటాల రవికి, రజనీకాంత్ కు బినామీ అనే ఆరోపణలపై

    దాసరి గారికి, పరిటాల రవికి, రజనీకాంత్ కు బినామీ అనే ఆరోపణలపై

    దాసరి గారికి, పరిటాల రవికి, రజనీకాంత్ కు బినామీ అనే ఆరోపణలపై ...... స్పందిస్తూ అన్నం తినేవాడు ఎవరూ ఆ మాట అనడు. అదే ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం, దీనికి నాది ఒకటే ఆన్సర్ అంటూ మోహన్ బాబు తేల్చి చెప్పారు.

    English summary
    Mohan Babu is an Indian film actor, director, and producer, known for his works predominantly in Telugu Cinema. An alumnus of the Madras Film Institute, Mohan Babu has acted in more than five hundred feature films in lead, supporting and a variety of roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X