నా మనసు గాయపరుస్తావా? నీవే అలాంటోడివి.. మోహన్‌బాబు ఫైర్
నటుడిగా వెండితెరపై, రాజకీయవేత్తగా పొలిటికల్ సర్కిల్స్‌లో హవా సాగించారు డాక్టర్ మోహన్ బాబు. రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించిన ఆయన.. గతంలో టీడీపీ పార్టీలో కీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంచు మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

గత ఎన్నికలకు ముందు పరిణామాలు..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు హయాంలో మంచు మోహన్ బాబు విద్యాసంస్థల ఫీజు రీ అంబర్స్మెంట్ విషయమై రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోహన్ బాబు రియాక్ట్ అయిన తీరు సంచలనం సృష్టించింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. వైసీపీ ప్రభుత్వం నెలకొల్పబడింది. ఇలాంటి తరుణంలో మళ్ళీ చంద్రబాబును ఉద్దేశిస్తూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారంటూ డైలాగ్ కింగ్..
సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్స్ పెట్టిన మోహన్ బాబు.. మొదటగా ''చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది'' అంటూ ట్వీట్ చేశారు.

బాబు.. నా మనసును గాయపరిచావంటూ సెన్సేషన్
''నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే'' ఆ వెంటనే మరో ట్వీట్ పెట్టారు మోహన్ బాబు.

నీ వ్యక్తిత్వం అలాంటిదంటూ చంద్రబాబుపై విమర్శల వర్షం
ఇక చివరగా.. ''క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!'' అని ట్వీట్ చేశారు మోహన్ బాబు.

సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
మంచు మోహన్ బాబు, చంద్రబాబుకు మధ్య విభేదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. తాజాగా చంద్రబాబుపై ఈ రేంజ్‌లో ఫైర్ అవుతూ మోహన్ బాబు ట్వీట్స్ పెట్టడం సినీ, రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారి తీస్తోంది.


Click it and Unblock the Notifications











