»   » నెం.1 అని డబ్బా ఎందుకు? కలెక్షన్స్ భాగోతం చెప్పిన మోహన్ బాబు, కామెంట్స్ ఎవరిపై?

నెం.1 అని డబ్బా ఎందుకు? కలెక్షన్స్ భాగోతం చెప్పిన మోహన్ బాబు, కామెంట్స్ ఎవరిపై?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైలాగ్ కింగ్ మోహన్ బాబు... తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనంటే కాస్త భయం. ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్, క్రమశిక్ష కోరుకునే వ్యక్తి, ఏదైనా తేడా వస్తే అస్సలు సహించరు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా అక్కడే కగిపారేస్తారు. తన మనసులో ఏముంటే అది మొహం మీదే చెప్పేస్తారు. చాలా కాలం తర్వాత మోహన్ బాబు 'గాయిత్రి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

 పోటీ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడను

పోటీ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడను

‘గాయిత్రి' సినిమాతో యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతున్నారనే కామెంట్లపై మోహన్ బాబు ఆసక్తికరంగా స్పందించారు. ఎవరూ ఎవరికీ పోటీ కాదు. నేనెప్పుడూ పోటీ అనే పదాన్ని కూడా ఉచ్చరించను. నాకు నేనే పోటీ, నీకు నువ్వే పోటీ... నేను ఇతరుకులకు పోటీ అని పాలిటిక్స్ లో చెప్పొచ్చు, అక్కడ మరొకరికి పోటీగా నిలబడతాం కాబట్టి.... అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

 అలాంటి అహంకారం లేదు

అలాంటి అహంకారం లేదు

నేనే నెం.1 అని చెప్పుకోవడాన్ని అహంకారంగా భావిస్తాను. నేను నెం.1, నా కలెక్షన్లు ఇవీ అంటూ ఎప్పుడూ డప్పు కొట్టుకోలేదు. ‘పుణ్యభూమి నాదేశం' చిత్రంలో జజ్జనకరి జనారే అని తన గురించి తాను డప్పు కొట్టుకుంటూ ఉంటాడు. ఇలా డబ్బాలు కొట్టుకోకూడదు. ప్రజలకు ఏది నిజం అనేది తెలుసు. నీ సినిమా 100 కోట్లు చేసింది, నాకు 10 కోట్లే వసూలు చేసింది అనుకుందాం. నేనే నెం.1 వంద కోట్లు ఇంకా ఎవరూ లేరు అని చెప్పుకుంటే... రేపు 101 కోట్లతో ఇంకోడు వస్తాడు..... అని మోహన్ బాబు అన్నారు.

 నిర్మాతలను భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్పమనండి

నిర్మాతలను భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్పమనండి

వంద కోట్లు వచ్చిందని మాత్రమే చెబుతారు. నిర్మాతలకు ఎంత లాభం వస్తుంది అనే నిజాలు చెప్పరు. దమ్ముంటే చెప్పమనండి. నిర్మాతలను భార్య బిడ్డల మీద ఒట్టేసి నేను పలానా సినిమా తీశాను. వంద కోట్లు కలెక్ట్ చేసింది. దాంట్లో నాకు 50 కోట్లు మిగిలింది అని ఒట్టేసి చెప్పమనండి. పబ్లిసిటీ అవసరమే... కానీ పబ్లిక్‌ను మోసం చేయడం కాదు చేయాల్సింది. నేను ఇపుడు నా సినిమా పబ్లిసిటీ కోసమే ఇంటర్వ్యూ చేస్తున్నాను. నిజాలు మాట్లాడుతున్నాను.... అని మోహన్ బాబు అన్నారు.

 లాభం రావాలని కోరుకోవడంలో తప్పులేదు

లాభం రావాలని కోరుకోవడంలో తప్పులేదు

నేను చాలా కాలం తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. మంచి విజయాన్ని సాధించాలని, మేము పెట్టిన డబ్బుతో పాటు అసలు, ఇంట్రెస్టు, లాభం రావాలని కోరుకోవడంలో తప్పు లేదు... అని మోహన్ బాబు అభిప్రాయ పడ్డారు.

 ఎగతాళి చేశారు

ఎగతాళి చేశారు

నేను సినిమాల్లో ట్రై చేసేపుడు రాయలసీమ వాడివి నీకు భాష తెలియదు అన్నారు. మీ స్లాంగ్ ఏమిటి? మీకు ఒత్తులు పలకవు అని ఎగతాళి చేశారు. అవన్నీ దిగమింగుకుని కసి, పట్టుదలతో ప్రయత్నించారు. గురువు నేర్పిన పాఠం, అన్నయ్య ఎన్టీ రామారావుగారి డిక్షన్ నాపై ప్రభావం చూపింది. అవమానాలు భరించి శభాష్ అనిపించుకున్న రోజున ప్రశాంతంగా నిద్ర పోయాను.... అని మోహన్ బాబు తెలిపారు.

 హీరోయిన్లు గడ్డి పరకతో సమానం

హీరోయిన్లు గడ్డి పరకతో సమానం

హీరోయిన్లు నాకు గడ్డి పరకతో సమానం. నేను పరిచయం చేసిన హీరోయిన్లు చాలా మంది తర్వాత చాలా ఫోజులు కొట్టడం చూశాను. శ్రీయను నేను పరిచయం చేయలేదు. నా సినిమాలో చేసింది. అద్భుతంగా నటించింది. అనుకున్న సమయానికి సెట్ కు వచ్చేవారు, ఇలాంటి మంచి హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో ఉన్నారని మోహన్ బాబు తెలిపారు.

 నాకు 100 నుండి 150 కోట్లు ఉన్నాయి

నాకు 100 నుండి 150 కోట్లు ఉన్నాయి

మనిషికి డబ్బు అనేది అవసరమే. మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి. పది మంది ఇంటికి వస్తే తిండి పెట్టే శక్తి కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కోట్లు కోట్లు అంటున్నారు...ఎక్కడివి ఆ కోట్లు, కష్టపడితే వచ్చినవా? మోసం చేస్తే వచ్చినవా. నువ్వే తినేది ఏమిటి? 40 సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి రాకముందు తిన్నది ఇండ్లీ, దోశ... లేదా చద్దన్నం. ఇపుడు కూడా అదే తింటున్నాను. బంగారంతో చట్నీ చేయం కదా. నా దగ్గర సినిమాల్లో యాక్ట్ చేసినవి వందో నూట యాభై కోట్లు ఉన్నాయి. అవే సంవత్సరానికి ఒకసారి వేస్తున్నాను... అంటూ మోహన్ బాబు చమత్కరించారు.

English summary
Mohan Babu Sensational Comments On Tollywood collections. Senior actor Mohan Babu is known for his expressing his opinions in a frank manner. He doesn't mince his word to speak on any topic. Mohan Babu recently made serious comments on the situation of the industry in his typical style.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu