ఎన్టీఆర్‌కి పర్సనల్ మేకప్‌మ్యాన్ మాత్రమే.. సరిగ్గా 7 గంటలకు, అన్నగారంటే అది.. మోహన్ బాబు!
సీనియర్ నటుడు మోహన్ బాబుకు స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని మోహన్ బాబు పలు సందర్భాల్లో బయట పెట్టారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని మోహన్ బాబు పంచుకున్నారు. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ రోజులకు గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ తో ఉన్న మెమొరబుల్ ఫోటోని మోహన్ బాబు షేర్ చేశారు. మేజర్ చంద్రకాంత్ చిత్రాన్ని స్వయంగా మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే.

నాకు మాత్రమే ఆ అదృష్టం
మోహన్ బాబు ట్విట్టర్ లో తెలుపుతూ.. మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పుణ్యభూమి నాదేశం సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ వివిధ గెటప్పుల్లో కనిపించాలి. ఎన్టీఆర్ కు ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఇంకెవరూ మేకప్ వేసేవారు కాదు. కానీ ఆ అవకాశం నాకు దక్కింది అని మోహన్ బాబు తెలిపారు. ఆ సాంగ్ చిత్రికరిస్తున్న సమయంలో నేను అన్నగారికి మేకప్ వేశానని మోహన్ బాబు తెలిపారు.
ప్రతి రోజు 7 గంటలకు
ప్రతి రోజు ఒక మేకప్ లో కనిపిస్తూ అన్నగారు ఉదయం 7 గంటలకల్లా షూటింగ్లో ఉండేవారని.. ఎన్టీఆర్ అంటే అది అని మోహన్ బాబు అన్నారు. నటన పట్ల ఎన్టీఆర్ కు ఉన్న అంకితభావం ప్రేమ అలాంటిది అని తెలిపారు. మోహన్ బాబు ఎప్పుడూ ఎన్టీఆర్ ని తన సోదరుడిగా భావిస్తుంటారు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ సంధర్భంగా మోహన్ బాబు అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే.

వివాదాస్పద వ్యాఖ్యలు
ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. క్రిష్ ని అభినందింస్తూ.. నీ దర్శత్వం అద్భుతంగా ఉంది. మా అన్నయ్యని చూస్తుననట్లే ఉంది. ఎక్కడ ప్రారంభించావో.. ఎక్కడ ముగించవో తెలియదు. చెడ్డవాళ్లని కూడా మంచివాళ్ళుగా చూపించావో తెలియియదు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో దుమారం రేగుతోంది.

సంక్రాంతి కానుకగా
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో వివిధ స్టార్స్ పోషించిన పాత్రలపై ఆసక్తి నెలకొని ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర ట్రైలర్ సోషల్ మెడియలోవైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య అదరగొడుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











