‘యంగ్ ఇండియా’..కు దాసరి లంచం!?
గత శుక్రవారం హైదరాబాదులోని హొటెల్ 'తాజ్ డెక్కన్" లో జరిగిన 'యంగ్ ఇండియా" నటీనటుల కార్యక్రమంలో కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి. కలెక్షన్ కింగ్ 'పద్మశ్రీ డా. మోహన్ బాబు 'మా" అధ్యక్షలు, ప్రముఖ నటుడు మురళీమోహన్ గారితో కలిసి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఒక సందర్బంలో 'యంగ్ ఇండియా" లో నటించిన ఒక హీరో మట్లాడుతుండగా..మద్యలో మోహన్ బాబు కల్సించుకుని 'అందరూ బయటేదో అనుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన మీరంతా దాసరిగారికి తలా ఓ లక్ష ఇచ్చారని గుసగుసలు వినబడుతున్నాయి. నిజమేనా? అని అడిగారు.
అసలే మొదటి సారి స్టేజి ఎక్కిన ఆ కుర్ర హీరో కాస్త తడబడ్డా," లేదు. ఆయన అలాంటివారు కాదు. ఈ చిత్రంలో నటించిన ఎవ్వరూ కూడా దాసరి గారికి రూపాయైనా ఇవ్వలేదు అని సమాధానమిచ్చాడు. మోహన్ బాబు అంటేనే ఒక సంచలనం. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం అలవాటు. ఈ సంగతి బాగా తెలిసిన మీడియా ఒక్కసారిగా తమ కెమెరాలకు పని చెప్పారు.
ఇదేంటి ఇంత నిండు సభలో మోహన్ బాబుగారు ఆయన గురువుగారి మీద ఇంతటి సంచలన వ్యాఖ్యలు చేశారేమిటి అని అనుకుంటున్న తరుణంలోనే, మీడియా వారి బుర్రలకి ఎక్కువ శ్రమ పెట్టకుండానే మోహన్‌బాబు మైకు అందుకున్నారు. తను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మాన్ని వివరిస్తూ' నేనేదో సరదాగా అన్నాను. దాన్ని మీడియా వారు చిలువలు పలవలు చేయొద్దు. అయినా…ఇంత మంది ఇన్నేళ్ళుగా ఇస్తున్న ప్రేమ ముందర ఈ డబ్బు ఏపాటిది? గత ముప్పై అయిదేళ్లుగా మా గురువుగారు దాసరి గారితో నాకున్న అనుబంధంతో ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఆయనకి ఏదైనా ఇవ్వడమే కానీ తీసుకోవడం చేత కాదు' అంటూ అక్కడ వేడెక్కుతున్న వాతావరణాన్ని తేలిక పరిచారు.


Click it and Unblock the Notifications











