‘సలీం’ గురించి గుట్టు విప్పిన మోహన్ బాబు
మంచు విష్ణు, హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'సలీం" ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఫంక్షన్ లో ఈ విషయాన్ని మోహన్ బాబు ప్రకటించారు. ఆ యన ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవానికి మా సినిమా ప్రేక్షకుల ముందుకు రావటంలో చాలా ఆలస్యం అయిన మాట నిజం. కానీ ఇప్పుడు ప్రింట్ చూసాక చాలా సంతోషంగా ఉంది ఆలస్యం అయినా బాగా వచ్చిందని చెప్పారు.
లక్ష్మీ ప్రసన్న కంబైన్స్ బ్యానర్ పై బిగ్ ఫిల్మ్తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సినిమా ఒక ప్రేమకథ అని ఇందులో విష్ణు, ఇలియానాలతో పాటు గిరిబాబు, కావేరీ ఝూ, నెపోలియన్, ఆలీ, తనికెళ్ళ భరణి తదితరులు నటించారని చెప్పారు. ఇది ఖచ్చితంగా విష్ణుకు మంచి గుర్తింపునిచ్చే సినిమా అని చెప్పిన దర్శకుడు ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పారు. విభిన్న కథనంతో మంచి చిత్రీకరణ జరిపామని ప్రేక్షకులని ప్రతి సీన్ అలరిస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











