twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఫ్ మానేసింది.. అనసూయ అలా పిలుస్తోంది, శ్రీయను కౌగిలించుకోవాలనుకున్నా.. కానీ!: మోహన్ బాబు

    |

    Recommended Video

    వైఫ్ మానేసింది.. అనసూయ అలా పిలుస్తోంది.. కౌగిలించుకోవాలనుకున్నా.. !

    టాలీవుడ్ లో ముక్కుసూటితనానికి కేరాఫ్ విలక్షణ నటుడు మోహన్ బాబు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేయడం, నచ్చకపోతే ఎదుటోళ్లు ఎంతటివారైనా అవలీలగా తీసిపారేయడం.. ఆయన మాటల్లో కనిపిస్తుంటుంది. తాజాగా జరిగిన 'గాయత్రి' ఆడియో ఫంక్షన్ లోను మోహన్ బాబు తనదైన శైలిలో మాట్లాడారు. సినిమా గురించి తన వ్యక్తిగత విషయాల గురించి ఆయన చేసిన ఆసక్తికర కామెంట్స్ మీకోసం..

    మాకు తెలిసింది ఇదొకటే..

    మాకు తెలిసింది ఇదొకటే..

    మాకు తెలిసిన ఫీల్డ్ ఇదొకటే. మాకు తెలిసిన వ్యాపారం సినిమానే. కష్టంతో కూడుకున్న ఈ వ్యాపారంలో జయాపజయాలు దైవాధీనం. నటుడిగా పుట్టా. నటుడిగా.. నిర్మాతగా తప్ప వేరే వ్యాపకాలు లేవు. భగవంతుడి ఆశీర్వాదాలతో విద్యాసంస్థ స్థాపించాను.

     విర్రవీగితే తొక్కేస్తాడు..:

    విర్రవీగితే తొక్కేస్తాడు..:

    మా బ్యానర్‌లో దాదాపు 60కు పైగా సినిమాలు తీశాం. విజయం వచ్చినప్పుడు విర్రవీగలేదు. అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఈ సినిమాకూ చాలా కష్టపడ్డాం. చాలామంది అంటుంటారు.. అలా తీశాం.. ఇలా తీశాం.. అని. కానీ అన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎంత అణిగి మణిగి ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇస్తాడు. విర్రవీగినప్పుడు ఒక తొక్కు తొక్కుతాడు.

     ఒక్క ఫ్లాప్ వస్తే..:

    ఒక్క ఫ్లాప్ వస్తే..:

    ఐదు సినిమాలు మంచి హిట్ సాధించి.. ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితే.. ఆ ఐదు సినిమాల హిట్టూ పోతుంది. నిర్మాత పని ఎంత కష్టమో మీకు తెలియదు. మా గురువు దాసరి నారాయణరావు గారు ప్రస్తుతం మన మధ్య లేకపోవడం పెద్ద లోటు.

     ఆ క్రెడిట్ ఆయనదే:

    ఆ క్రెడిట్ ఆయనదే:

    నన్ను నటుడిగా పరిచయం చేసిన మా గురువు దాసరి నారాయణరావుగారు ఎంత గొప్ప దర్శకుడో ఈ జనరేషన్‌కి తెలీదు. మహానటుడు ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో డైలాగులు చెప్పే నటుడు అని నాకు పేరొచ్చిందంటే ఆ క్రెడిట్‌ మా గురువుగారిదే.

     అనసూయ అలా పిలిచింది..

    అనసూయ అలా పిలిచింది..

    నా వైఫ్ ఎప్పుడూ నన్ను బావా అని పిలుస్తూ ఉంటుంది. ఈ మధ్య అలా పిలవడం మానేసింది. ఎందుకంటే సక్సెస్ లేదు కదా..! సక్సెస్ లేకపోతే ఎవ్వరూ పిలవరు. నన్ను బావా అని పిలిచింది అనసూయ. అనసూయ గురించి రోజూ నాకు కంప్లయింట్‌లే. ప్రతీ సినిమాకు ఎవరితో ఒకరితో గొడవ ఉంటుంది. కానీ, ఈ సినిమాకు ఎలాంటి గొడవలు వద్దని.. నన్ను నేను చాలా కంట్రోల్‌ చేసుకున్నా.

     శ్రీయను కౌగిలించుకోవాలనుకున్నా..:

    శ్రీయను కౌగిలించుకోవాలనుకున్నా..:

    'గాయత్రి' షూటింగ్ టైమ్‌లో శ్రీయ నటన చూస్తున్నప్పుడు.. ఆమెను కౌగిలించుకోవాలనిపించేది. కానీ విష్ణు ఎక్కడ సీరియస్‌ అవుతాడోనని ఊరుకున్నా (నవ్వుతూ). సినిమాలో విష్ణు కూడా తన నటనతో కంటతడి పెట్టించాడు. ఈ సినిమాలో ఆమె పలికించిన హావభావాలు నిజంగా సూపర్‌. శ్రియ చేసిన పాత్రను ఈ జనరేషన్‌లో ఎవరూ చేయలేరు.

     ఎన్ని వందలసార్లు రాసుంటాడో..:

    ఎన్ని వందలసార్లు రాసుంటాడో..:

    సినిమాకు డైమండ్‌ రత్నబాబు ఎన్ని వందల సార్లు డైలాగ్‌లు రాశాడో నాకే తెలియదు. ప్రతీ డైలాగ్‌ ఓ మాస్టర్‌ పీస్‌. అలాగే పరచూరి అగ్రజులు అప్పుడప్పుడు వచ్చి కొన్ని డైలాగ్‌లు అందించారు. కనీసం డబ్బులు కూడా తీసుకోలేదు.

    మదన్‌ మంచి రచయిత, దర్శకుడు. కథ ఎక్కడా పక్కదోవ పట్టకుండా తీశాడు. కెమెరామెన్‌ సర్వేష్‌ మురారి 'గాయత్రి' సినిమాను చాలా అందంగా తీశాడు. ఈ సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డాం. అందరికంటే ఎక్కువ కష్టపడింది దర్శకుడు మదన్.

    English summary
    Tollywood top hero Mohan Babu praised heroine Shreya for her performance in Gayatri movie. Mohan Babu said no one can do that character except Shreya in this generation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X