ఎన్టీఆర్ బయోపిక్: చెడ్డవారిని మంచిగా చూపావా క్రిష్? మోహన్ బాబు సంచలన స్పీచ్!

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.... అన్నయ్యతో నాకు ఉన్న అనుబంధం చాలా మందికి తెలియదు. మద్రాసు వైఎంసీ కాలేజీలో చదువుతున్నపుడు గుంపులో వెళ్లి వందమందిలో ఒకడిగా ఆయన్ను చూశాను. భక్తవత్సలం నాయుడు అనే నన్ను దాసరి నారాయణరావుగారు మోహన్ బాబుగా మార్చి అన్నయ్యతో ఒక సినిమా చేసే అవకాశం ఇచ్చారు అని గుర్తు చేసకుున్నారు.

 తరతరాలు ఆ పెర్ఫార్మెన్స్ అలా ఉండిపోతుంది

తరతరాలు ఆ పెర్ఫార్మెన్స్ అలా ఉండిపోతుంది

1982 సంవత్సరంలో ‘శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్' పెట్టినపుడు బొబ్బిలిపులి గెటప్‌లో అన్నయ్య ఫస్ట్ కొబ్బరికాయ కొట్టారు. ఆ తర్వాత 1993లో మా బేనర్లో అన్నయ్య చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్' తీశాను. ఎన్నియుగాలు, తరాలు వచ్చినా ఆ మహానటుడు అందులో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అలా ఉండిపోతుంది.

 అన్నయ్యను డౌన్ డౌన్ అన్నారు

అన్నయ్యను డౌన్ డౌన్ అన్నారు

ఏక గర్భంనందు జన్మించలేక పోయినా మేమంతా అన్నదమ్ములం అన్నారు. నేను, అన్నయ్య మేజర్ చంద్రకాంత్ షూటింగ్ పూర్తి చేసుకుని ఓ ఫంక్షన్ వెళితే అక్కడ కాంగ్రెస్ వారు డౌన్ డౌన్ అన్నారు. అపుడు నేను ఒక్కడినే ఎన్టీఆర్ జిందాబాద్ అన్నాను. అపుడు ఆయన నీకేమిటి ఆ ధైర్యం అన్నారు. ‘జీనా హైతో మర్నాసీకో కదం కదంపర్ కట్టా సీకో' అన్నాను.

 అన్నయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా

అన్నయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా

మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ తిరుపతిలో చేస్తే కొన్ని లక్షల మంది వచ్చారు. 1994లో మొట్టమొదటిసారి అన్నయ్యను షిరిడి తీసుకెళ్లినపుడు నన్ను ఏం కోరుకున్నారు బ్రదర్ అని అడిగారు. అన్నయ్య... మీరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని తీసుకొస్తాను అని దేవుడితో కోరుకున్నాను అన్నాను.

ఆ విషయం ఇక్కడ చెప్పకూడదు

ఆ విషయం ఇక్కడ చెప్పకూడదు

మరి నేనేం కోరుకున్నానో మీరు అడగలేదే? అని అన్నయ్య అన్నారు. చెప్పండి అన్నయ్యా అన్నాను... వద్దులే అని రెండు మూడు సంఘటనలు చెప్పారు. ఒకటి ఇక్కడ చెప్పకూడదు. ఏదిఏమైనా ఆ మహానటుడిని 1995లో మళ్లీ షిరిడికి తీసుకెళ్లాను. ఆ మహానటుడితో నాకున్న అనుబంధం జన్మజన్మలకు మరిచిపోలేను.

లంచం అంటే తెలియదు

లంచం అంటే తెలియదు

ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన లంచం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి. నందమూరి కుటుంబానికే ఆ లంచం అనే పదం తెలియదు. చాలా మంచి వ్యక్తులు, మంచి కుటుంబం.. అటువంటి కుటుంబంలో పుట్టిన బాలయ్యను అన్నయ్య రూపంలో చూస్తుంటే నా రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఈ పిక్చర్ గొప్పవిజయం సాధించాలి, ఒక చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను.

చెడ్డవారిని మంచి వారిగా చూపించావో తెలియదు

క్రిష్ చాలా బాగా చేశావ్... అందులో మా అన్నయ్యే కనిపిస్తున్నారు. ఎక్కడ పిక్చర్ ప్రారంభించావో? ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాంట్లో చెడ్డవాళ్లను కూడా మంచి వాళ్లను చేశావో? ఎవరెవరిని ఎలా చూపించావో? తెలియదు. అందరికీ బెస్టాఫ్ లక్ అని మోహన్ బాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X