లేడీ రిపోర్టర్ కి షాకిచ్చిన మోహన్ బాబు
చెన్నయ్ : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నానుతూనే ఉంటారు. మోహన్ బాబు ఏ వ్యాఖ్యలు చేసినా సంచలనంగానే ఉంటాయి. తాజాగా తన కుమారుడు విష్ణు నటిస్తున్న 'దేనికైనా రెడీ' చిత్రం ప్రమోషన్లో భాగంగా ఓ తమిళ లేడీ రిపోర్టర్ విష్ణును ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఆమె వేరే పనిమీద మోహన్ బాబును కలిసింది.
ఆమెతో ప్యూర్ తమిళ్ లో మాట్లాడి షాకయ్యేలా చేసాడట మోహన్ బాబు. తమిళులు అయినా కొందరు ఈ రేంజిలో స్పష్టంగా తమిళం మాట్లాడలేరు. మీరు తెలుగు వారు అయి ఉండి తమిళం అదరగొడుతున్నారని సదరు లేడీ రిపోర్టర్ మోహన్ బాబును పొగిడేసినట్లు తెలుస్తోంది.
దేనికైనా రెడీ చిత్రం విషయానికొస్తే....అందాలతార హన్సిక ఇందులో కథానాయిక. అక్టోబర్ 24న ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో విష్ణు పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పారు. 'ఢీ'తో తొలి విజయాన్ని ఢీ కొట్టిన మంచు విష్ణుకు ఆ తర్వాత అలాంటి హిట్టు దక్క లేదు. దీంతో ఇప్పుడు 'దేనికైనా రెడీ' అంటున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్ బాబు.


Click it and Unblock the Notifications











