మోహన్ బాబు అల్లుడుగా సునీల్
మోహన్ బాబు, సునీల్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం అవుతోందని సమాచారం. కోనవెంకట్, గోపీమోహన్, బివియస్ రవి కథ వండుతున్న ఈ చిత్రం టైటిల్ రాయుడుగారికి కోపమొచ్చింది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు మామగానూ, సునీల్ అల్లుడుగానూ కనపించనున్నారు. కామిడీ ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ చిత్రం మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై నిర్మిచనున్నారు. ఈ చిత్రం కథ నిమిత్తం గత కొద్ది రోజులుగా వైజాగ్ లో సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
లక్ష్మీ ప్రసన్న నిర్మించే ఈ చిత్రాన్ని ఈ నివాస్ దర్శకత్వం వహించనున్నారు. మరో ప్రక్క మోహన్ బాబు తన రెండో కుమారుడు మంచు మనోజ్ తో ఊకొడతారా..ఉలిక్కి పడతారా అనే చిత్రం నిర్మిస్తున్నారు. రాజా అనే కొత్త దర్శకుడు ఆ చిత్రంతో పరచయం కానున్నాడు. ఇక దర్శకుడు ఈ నివాస్ గతంలో హిందీలో శూల్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. కానీ తర్వాత వచ్చిన చిత్రాలు ఫెయిల్యూర్ కావటంతో పూర్తి ఖాలీగా ఉన్నాడు. కోన వెంకట్ రికమెండేషన్ తో సీన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రామూ క్యాంప్ కి చెందిన నివాస్ కీ కోనవెంకట్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అవి వర్కవుట్ చేసే ఈ చిత్రం ప్లాన్ చేసినట్లు వినికిడి.


Click it and Unblock the Notifications











