ఆదుకోవడం నా అలవాటు, మీరూ ఆదుకోండి: మోహన్ బాబు
హైదరాబాద్: తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ బాధ్యతగా తుఫాను బాధితులకు సాయం అందించాలని సినీ నటుడు మోహన్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కష్టనష్టాలు వచ్చినప్పుడు నటుడిగా ముందుండి వారిని ఆదుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చారు.
తన కుమారుడు, సినీహీరో మనోజ్, స్నేహితులు కలిసి సుమారు 30 లక్షలు వరకు తుఫాన్ బాధితుల కోసం సాయం చేశారన్నారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సిబ్బంది మొత్తం ఒక్క రోజు వేతనం తుఫాను బిధితులకు విరాళంగా ఇస్తున్నామని నటుడు విష్ణు పేర్కొన్నారు.

అదేవిధంగా విద్యార్థుల దగ్గర కూడా విరాళాలను సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. తమ కళాశాల సీనియర్ విద్యార్థులను వైజాగ్‌కు తీసుకెళ్లి ప్రజలకు అవసరమైన సేవలందిస్తామని పేర్కొన్నారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడటం అభినందించదగ్గ విషయమన్నారు.


Click it and Unblock the Notifications











