బేబీ సిట్టర్ గా ...పాలు పట్టిస్తూ మోహన్ బాబు (ఫొటో)
హైదరాబాద్ :ముద్దుల మనుమరాలితో మోహన్ బాబు ...బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు లక్ష్మి కుమార్తె ..విద్యా నిర్వాణ తో ఆయన ఇదిగో ఇలా ఆడుకుంటున్నారు. తన మనుమరాలికి పాలు పట్టిస్తూ ఇదిగో ఇలా కెమెరాకు దొరికిపోయారు. మొన్నటివరకూ తన పెద్ద కుమారుడు మంచు విష్ణు కుమార్తెలు అరియానా, ఇరియానా లతో కాలం సరదాగా కాలక్షేపం చేసారు. ఆయన తాత గా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక రెండు రోజుల క్రితం మోహన్ బాబు సినిమా ఇండస్ర్టీ ఎవడబ్బ సొత్తు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మరోసారి మారారు. తానెప్పుడూ చిన్న నిర్మాతల పక్షానే ఉంటానని, చిన్న సినిమాలు తీసే వాళ్లే అసలైన నిర్మాతలు అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం పరిశ్రమలో మంచి నిర్మాతలు తగ్గిపోయారని, కొందరు పైనాన్షియర్ల సాయంతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి నటులకు డబ్బులు ఎగ్గొడుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి వాడు నిర్మాత కాదు..దొంగ, లఫూట్ అంటూ ఫైర్ అయ్యారు. దౌర్జన్యాలు చేసే వారు కాలగర్భంలో కలిసి పోతారన్నారు. కొందరు దర్శకులు సైతం నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై త్వరలో స్పందిస్తానని మోహన్ బాబు స్పష్టం చేసారు. ఆయన ఈ వ్యాఖ్యల చేసింది నైజాం ఏరియాకు చెందిన ఓ బడా నిర్మాత నేతృత్వంలో కొందరు బడా నిర్మాతలు సిండికేట్ అవడం గురించే అని టాక్.


Click it and Unblock the Notifications











