twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బిడ్డలను మిస్సయ్యా, ఇప్పుడు మూడు షిఫ్ట్‌లూ వాడితోనే: మోహన్‌ బాబు

    By Bojja Kumar
    |

    మోహన్ బాబు కుమారుడు, సినీ నటుడు మంచు విష్ణు ఇటీవల మళ్లీ తండ్రయిన సంగతి తెలిసిందే. విష్ణు భార్య వెరోనికా హైదరాబాద్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మనవడు పుట్టడంపై మోహన్ బాబు చాలా ఆనందంగా ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా తన మనసులోని భావాలు పంచుకున్నాడు.

    Recommended Video

    ఆ ఫోటోలో ఉన్నది నా కొడుకు కాదు.. మంచు విష్ణు రిక్వెస్ట్ !
     మూడు షిప్టులు వాడితోనే

    మూడు షిప్టులు వాడితోనే

    ‘నా బిడ్డలు పుట్టినప్పుడు...3 షిఫ్ట్ లలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే 3 షిఫ్ట్ లూ వాడితోనే గడుపుతున్నాను' అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

    మంచు కుటుంబంలో ఆనందోత్సాహం

    మంచు కుటుంబంలో ఆనందోత్సాహం

    మంచు ఫ్యామిలీలో తొలి మూడోతరం వారసుడు పుట్టాడు. దీంతో మంచు ఫ్యామిలీ సెలబ్రేషన్ మూడ్లో ఉంది. మూడు రోజుల క్రితం వారసుడు పుట్టగా ఫ్యామిలీ మొత్తం ఇతర పనులు పక్కనపెట్టి తమ ఇంటి బుజ్జవారసుడితోనే గడుపుతున్నారు.

     సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు

    సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు

    మంచు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతున్న వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు వారిని అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఎవరో అబ్బాయి ఫోటోను తన కొడుకుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని నమ్మవద్దని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు.

     త్వరలో ఫోటోస్ విడుదల చేస్తాం

    త్వరలో ఫోటోస్ విడుదల చేస్తాం

    త్వరలోనే తన కుమారుడి రియల్ ఫోటో అభిమానులతో పంచుకుంటానని, అప్పటి వరకు అభిమానులు, వెల్ విషర్స్ ఓపిక పట్టాలని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు. ఫేస్ ఫోటోలను స్ప్రెడ్ చేయడం ఆపాలన్నారు.

     మోహన్ బాబు ఫ్యామిలీ

    మోహన్ బాబు ఫ్యామిలీ

    మోహన్ బాబు ఇద్దరు కుమారుల్లో మంచు విష్ణకు మాత్రమే పిల్లలు ఉన్నారు. మనోజ్‌కు గతేడాది వివాహం జరిగినా ఇంకా కిడ్స్ విషయంలో ప్లాన్ చేసుకోలేదు. మంచు లక్ష్మికి ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే.

     మంచు విష్ణు

    మంచు విష్ణు

    మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. తమ కుటుంబంలో ఇపుడు కొత్తగా మరో అబ్బాయి యాడ్ కావడంతో మంచు ఫ్యామిలీ సెలబ్రేషన్ మూడ్లో ఉంది.

    English summary
    Mohan Babu tweet about his grandson. Mohan Babu son Manchu Vishnu becomes a father again. Manchu Vishnu and Veronica couple were blessed with a baby boy on January 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X