మోహన్‌బాబు మోడీ జపం, వర్మ వెటకారం!
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ 'నవభారత యువభేరీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోహన్ బాబు తన ట్విట్టర్ ద్వారా మోడీ జపం మొదలు పెట్టారు.
మోడీని కలిసేందుకు తన కూతురు లక్ష్మీ ప్రసన్నే ఏర్పాట్లు చేసిందని, ఇందుకు ఎంతో గర్విస్తున్నాను అంటూ మోహన్ బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మోడీ ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆయన్ను కలిసే అవకాశం దక్కడం ఎంతో గొప్పగా భావిస్తున్నానని, మోడీ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాడిని కాదు అనిచెప్పుకున్న మోహన్ బాబు.....మోడీని మీట్ కావడానికి సహకరించిన బిజేపీ నాయకుడు సిహెచ్. విద్యాసాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద మోడీని కలిసిన తర్వాత మోహన్ బాబులో ఏదో తెలియని ఆనందానికి, ఉత్సహానికి లోనైనట్లు ఆయన వ్యాఖ్యల్లో స్పష్టం అవుతోంది.
మరో వైపు వివాదాస్పద దర్శకుడు రామో గోపాల్ వర్మ మోడీ గురించి వెటకారపు వ్యాఖ్యలు చేసారు. మోడీ తన సభముగింపులో జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేసారు. ఆయన మహా తెలివైన వారు అంటూ తన ట్విట్టర్లో కామెంట్ చేసారు. మోడీ నోట సమైక్యాంధ్ర ప్రస్తావన రాకపోవడంపై రామ్ గోపాల్ వర్మ కాస్త ఫీలవుతున్నట్లు ఆయన వ్యాఖ్యల్లో స్పష్టం అవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత కూడా వర్మ తన ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











