»   » ఉరి శిక్ష వివాదం: సల్మాన్‌‌కు మోహన్ బాబు సపోర్ట్

ఉరి శిక్ష వివాదం: సల్మాన్‌‌కు మోహన్ బాబు సపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముంబై పేలుళ్ల కేసులో యాకుబ్ ను ఉరి తీయడంపై సల్మాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు సల్మాన్ ఖాన్ కు సపోర్టుగా నిలిచారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటు కొందరు సల్మాన్ ఖాన్ విషయంలో రాద్దాంతం చేస్తున్నారని, దాన్ని ఆపాలని మోహన్ బాబు ట్వీట్ చేసారు. ఆయన చెప్పిన దాంట్లో వైవిధ్యం ఏమీ లేదు...చాలా మంది ఎంపీలు చెప్పిందే ఆయన చెప్పారు. ఆయన చేసింది తప్పు అయితే ఆ విషయంలో మాట్లాడిన ఇతర ఎంపీలందరిదీ తప్పే అంటూ మోహన్ బాబు ట్వీట్ చేసారు.

ముంబై పేలుళ్ల కేసులో యాకుబ్‌ని కాకుండా అతని సోదరుడు టైగర్ మొమన్‌ని ఉరి తీయాలంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పారిపోయిన నక్క (టైగర్ మెమెన్) బదులు అతని సోదరుడిని ఉరి తీయవద్దు. ఒక అమాయకుడిని చంపేస్తే అది మానవత్వన్ని చంపడంతో సమానం అంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసారు.

Mohan Babu tweet about Salman khan

అయితే తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ వెంటనే వెనక్కి తగ్గారు. బేషరతుగా క్షమాపణలు కోరార. యాకూబ్ ను తానేమీ అమాయకుడిగా చెప్పలేదని వివరణ ఇచ్చారు. దేశ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తన తండ్రి సలీంఖాన్ సూచనపై వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని, అవి అర్థ రహితమని సలీం ఖాన్ పేర్కొన్నారు.

English summary
"A section of media and people should stop witch hunting SalmanKhan. He said nothing different from what many M.Ps have said. If he is wrong and so are all the parliamentarians who raised the same issue" Mohan Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu