»   » మోహన్ బాబుకే టికెట్ దొరకలేదట...ఇంక మిగతావారి పరిస్దితి ఏంటో?

మోహన్ బాబుకే టికెట్ దొరకలేదట...ఇంక మిగతావారి పరిస్దితి ఏంటో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సీనియర్ నటుడు, లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అధినేత, తెలుగు సినీపరిశ్రమ పెద్ద మంచు మోహన్ బాబుకు సినిమా టికెట్ దొరకలేదట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ లో వెల్లడించారు. ఇంతకీ ఏం టిక్కెట్ అంటారా..

తన కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన 'ఈడోరకం ఆడో రకం' సినిమాను అభిమానులతో కలిసి థియేటర్ లో చూడాలని ప్లాన్ చేసుకున్నారు మోహన్ బాబు.అయితే తాను అనుకున్న సమయానికి టికెట్లు దొరకపోవటంతో ఈ బాధ ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.మోహన్ బాబు శుక్రవారమే సినిమా చూడాలనుకున్నా టికెట్లు దొరకపోవటంతో నిర్మాత అనీల్ సుంకరను అడిగి శనివారానికి టికెట్లు తెప్పించుకున్నారట.కానీ ఆరోజు కూడా తాను అడిగినన్ని టికెట్లు దొరకలేదని చెప్పారు. మంచు విష్ణుతో పాటు రాజ్ తరుణ్ మరో హీరోగా తెరకెక్కిన ఈడో రకం ఆడో రకం సినిమాకు జి నాగేశ్వరరెడ్డి దర్శకుడు.ఈ గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవటంతో పాటు అదే స్థాయిలో కలెక్షన్లు కూడా వసూళ్లు చేస్తోంది.మొత్తానికి తనకి టికెట్లు దొరకలేదన్న బాధ ఉన్నప్పటికీ తన కొడుకు సినిమా మంచి విజయం సాధించడం పట్ల మోహన్ బాబు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది.


English summary
Mohan Babu M tweeted:This is what I call a clean Super Hit Wanted to watch #EedoRakamAadoRakam in the theatre amongst the crowd. To enjoy their reaction. But I couldn't get tickets in Multiplexes today and AnilSunkara had to be bullied for a show tomorrow in the theatre. And finally he managed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu