వద్దని లక్ష్మీప్రసన్నకు చెప్పా: మోహన్ బాబు
హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్నకు సినిమాలు వద్దని చెప్పానని మీడియాతో అన్నారు. ఆమె నిర్మాతగా మారి 'ఝమ్మంది నాదం' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు 'ఊ కొడతారా... ఉలిక్కి పడతారా' చిత్రాన్ని తీసింది. మరోవైపు నటిగా, టి.వి. టాక్ షో నిర్వాహకురాలిగా బిజీగా ఉంది. నిజానికి లక్ష్మీప్రసన్నను సినిమా రంగం వైపు వద్దని తనకున్న ఇతర వ్యాపారాల వైపు దృష్టి పెట్టాల్సిందిగా సూచించానని ఆయన అన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ..."నేటి పరిస్థితుల్లో సినిమా తీయడం అంత సులువు కాదు. క్రమశిక్షణా రాహిత్యం కనిపిస్తుంది. కొందరు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా తీయవద్దని తనకున్న విద్యా సంస్థల బాధ్యతలను చేపట్టాల్సిందిగా మోహన్‌బాబు చెప్పారు. అయితే లక్ష్మీప్రసన్న సినిమా రంగానికి రావడానికే ఆసక్తి చూపింది. అమెరికాలో షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో శిక్షణ పొందింది. దాంతో తన దృష్టి అంతా సినిమాలపైనే నిలిపింది. తన తాతగారు పేరు మీద మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను నెలకొల్పింది" అన్నారు.
అలాగే "ఆమె సోదరులు విష్ణు, మనోజ్ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తూ ప్రోత్సహించారు. లక్ష్మీ సొంతంగా సంస్థను నెలకొల్పిన విషయమే నాకు తెలియదు. తెలిశాక ఈ రంగం పట్ల ఆమెకున్న ఉత్సాహాన్ని ప్రోత్సహించాను. తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాను. 'ఊ కొడతారా... ఉలిక్కి పడతారా' షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకటి, రెండు సార్లు మినహా సెట్‌కు వెళ్లింది లేదు. అయితే సినిమా తొలి కాపీ చూశాక విజయంపై నమ్మకం ఏర్పడింది" అని మోహన్‌బాబు చెప్పారు.
ఇక లక్ష్మి ప్రసన్న ఈ చిత్రం విజయం సాధించిందని అన్నారు. అలాగే బాలకృష్ణ పోషించిన పాత్ర సినిమాలో బాగా ఎలివేట్ అయ్యింది. "అందరూ మా నాన్నగారు మోహన్ బాబు ని ఈ సినిమాలో ఆ పాత్రకు తీసుకుంటామనుకున్నారు. కానీ బాలకృష్ణ ని తీసుకోవటం అందరకీ ఆశ్చర్యమనిపించింది. ఆ ఆశ్చర్యపోయే ఫాక్టరే సినిమాకు క్రేజ్ తెచ్చింది" అన్నారామె.


Click it and Unblock the Notifications











