పెదరాయుడు పాత్రలో విష్ణు..రజనీకాంత్ పాత్రలో మోహన్ బాబు
మోహన్ బాబు కెరీర్ లో పెదరాయుడు చిత్రం ఓ సంచలనం. ఆ చిత్రంలో తాను పోషించిన పెదరాయుడు పాత్రను తన కుమారుడు విష్ణు పోషిస్తే..తాను అందులో రజనీకాంత్ చేసిన పాత్ర చేయాలనుందని తాజాగా మోహన్ బాబు తన మనో భావాన్ని మీడియా ముందు ఉంచారు. తను ముఫ్పై ఐదు సంవత్సరాలు సినీ కెరీర్ ని పూర్తి చేసిన సందర్బంగా ఓ టీవీ ఛానెల్ తో చేసిన లైవ్ ఇంటర్వూలో ఈ విషయాలను వెళ్ళడించారు. అయితే అంతటి పవర్ ఫుల్ కధ దొరకటం లేదంటూ ఆవేదన వెళ్ళబుచ్చారు. ఇక తాను సలీం చిత్రంలో కామిడీ విలన్ పాత్ర చేసానని, చాలా కాలం తర్వాత తాను చేసిన మంచి పాత్ర అది అని కితాబు ఇచ్చుకున్నారు. అలాగే తనను రాజకీయాల్లోకి లాగవద్దని,ఆసక్తి లేదని అన్నారు. సంవత్సరానికి ఓ మంచి పాత్ర చేస్తే చాలని,తన కుమారుల కెరీర్ పైనే దష్టి పెడుతున్నట్లు చెప్పారు. అలాగే తాము ఆ కాలంలో చేసిన పాత్రలే తిరిగి హీరోలను మార్చుకుంటూ రిపీట్ అవుతున్నాయని కామెంట్ చేసారు. అంతేగాక తనకు అన్నగారంటే ప్రత్యేకాభిమానమని ఆయన తమ మేజర్ చంద్రకాంత్ చిత్రంలో చేయటం తన అదృష్టమని,పుణ్యభూమి నా దేశం సాంగ్ అధ్బుతంగా వచ్చిందని అన్నారు. ఈ విషయాలు చెబుతూ యమదొంగ చిత్రంలోని యముడు పాత్ర చాలా బాగా వచ్చిందని,అందులో డైలాగును వినిపించారు.


Click it and Unblock the Notifications











