»   » వర్మ చిత్రంలో మోహన్‌బాబు గెటప్ ఇలా

వర్మ చిత్రంలో మోహన్‌బాబు గెటప్ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mohan babu
హైదరాబాద్ : మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్పెషాలిటీ ఏమిటీ అంటే ఈ చిత్రంలో మోహన్ బాబు తన ఒరిజనల్ హెయిర్ స్టైల్ అంటే బట్టతలతనో కనిపించనున్నారని విశ్వసనీయ సమాచారం. మొదటి మోహన్ బాబు దానికి ఒప్పుకోకపోయినా వర్మ కన్వీన్స్ చేసి ఒప్పించాడని తెలుస్తోంది. ఈ గెటప్ లో మోహన్ బాబు...ఓ పెద్దాయన కనిపించనున్నారు. ఇక ఈచిత్రానికి 'రౌడీ' అనే పేరు ఖరారు చేశారు.

రౌడీ సెంటిమెంట్‌ మోహన్‌బాబుకి బాగా కలిసొచ్చింది. రౌడీగారి పెళ్లాం, అసెంబ్లీ రౌడీ, రౌడీ మొగుడు... ఇలా ఎక్కువ సార్లు వెండి తెరపై ఆయన రౌడీగానే కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆ అవతారంలో వినోదం పంచబోతున్నారు. మోహన్‌బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు సరసన శాన్వి కథానాయికగా ఎంపికైంది. రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది. అంతకు ముందు 'అన్నగారు', 'ఒట్టు' అనే పేర్లు పరిశీలించారు. చివరికి 'రౌడీ'వైపే చిత్రబృందం మొగ్గుచూపించింది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

మోహన్ బాబు మాట్లాడుతూ... రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం. నా పోర్షన్ షూటింగ్ అయిపోయింది. విష్ణు పోర్షన్ నడుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఫస్ట్‌కాపీ ఇస్తానన్నాడు వర్మ. అలాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. అందులో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

English summary
Ramgopal Varma's film with Manchu family is currently progressing at brisk pace in Hyderabad. Earlier the buzzes spread wide in industry that the makers are finalised title as “Ottu”, but latest updated news is that the unit confirmed the title as “Rowdy”. The official announcement is yet to be made. Mohan Babu is playing an important role in the film produced on Mohan Babu's own production house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu