Mohan Babu ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన తిరుపతికి కుటుంబం.. అసలు ఏమైందంటే?

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు కన్నుమూసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు సోదరుడు ఎలా చనిపోయారు ? ఏమైంది అనే వివరాల్లోకి వెళితే

తీవ్ర విషాద ఛాయలు

తీవ్ర విషాద ఛాయలు

సీనియర్ నటుడు నిర్మాత మోహన్ బాబు వాసంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మోహన్ బాబు సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో బుధవారం నాడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్య కారణాలతో తిరుపతి లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రంగస్వామి నాయుడు అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా మీడియాకు వార్తలు వచ్చాయి.

వ్యవసాయం చేసుకుంటూ

వ్యవసాయం చేసుకుంటూ

రంగస్వామి నాయుడు వయసు 63 సంవత్సరాలు కాగా ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. సోదరుడు పెద్ద హీరో, నిర్మాత అయినా సరే అది పట్టకుండా తిరుపతి లోనే ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన మోహన్ బాబు చేపట్టిన పలు సామాజిక కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనేవారిని సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

సంతాపం

సంతాపం

రంగస్వామి నాయుడు మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సినీ ప్రముఖులు మోహన్ బాబుకు ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. గురువారం నాడు అంత్యక్రియలు జరగనుండగా ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు సహా ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె తో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐదుగురు సంతానం కాగా

ఐదుగురు సంతానం కాగా

మోహన్ బాబు తల్లిదండ్రులకు మొత్తం ఐదుగురు సంతానం కాగా వారిలో రంగస్వామి నాయుడు, రామచంద్ర నాయుడు, కృష్ణ, భక్తవత్సలం నాయుడు అనే నలుగురు మగ పిల్లలు ఉన్నారు, అలాగే విజయ అనే ఒక ఆడ సంతానం కూడా ఉన్నారు. నటన మీద ఆసక్తితో చెన్నై వెళ్లిన మంచు భక్తవత్సలం నాయుడు ఎట్టకేలకు నటుడుగా నిరూపించుకుని మోహన్ బాబు గా అవతరించాడు.

నిర్మాతగా మారి

నిర్మాతగా మారి

నటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. ఇటీవల ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కారణంగా వార్తల్లోకెక్కారు. మంచు మోహన్బాబు తమ బెదిరించారని బూతులు తిట్టాడు అని చెబుతూ మంచు విష్ణు ప్యానల్ కి వ్యతిరేకంగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ పానెల్ సభ్యులు ఆరోపించారు.

Recommended Video

Actor Karthikeya & Tanikella Bharani Interview Part 2
 సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే


అయితే ఈ విషయం మీద మోహన్ బాబు మరలా స్పందించింది లేదు కానీ ఆ తర్వాత బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా ఎంబికే షో లో గెస్ట్ గా కనిపించి తన మనోగతాన్ని వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సన్నాఫ్ ఇండియా అనే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వీలైనంత త్వరగా ఈ సినిమాని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తుండగా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తోంది..రిలీజ్ డేట్ చూసుకుని సినిమాని విడుదల చేయడానికి ఇప్పటికే పలు సార్లు ప్రయత్నించారు కానీ అనుకోని కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X