పవన్, మహేష్‌కు ఎక్కడ తేడా కొట్టిందో.. కలిసి ఉంటే బొమ్మ దద్దరిల్లేదే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్ సెట్ కావడమంటే మాములు విషయం కాదు. హీరో, హీరోయిన్ల కాంబినేషన్లు సెట్ కావాలంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది. ఇక మల్టీస్టారర్ సినిమాలంటే ఇక హీరోలను, ఒప్పించడం, వారి డేట్లు సెట్ కావడం బ్రహ్మండంగా మారుతుంది. తాజాగా అలాంటి క్రేజీ కాంబినేషన్‌ ఆలోచనకు జీవం వస్తే.. టాలీవుడ్ రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏమా కాంబినేషన్.. ఏంటా మల్టీస్టారర్ సినిమా అంటే..

గతంలో పవన్, మహేష్ కాంబినేషన్

గతంలో పవన్, మహేష్ కాంబినేషన్

గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఓ ప్రయత్నం జరిగింది. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు కోసం పవన్ కల్యాణ్‌ను వెంకటేష్ స్థానంలో ఊహించుకొన్నారట. అయితే పవన్‌ను అడిగితే నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే జరిగి ఉంటే.. సిరిమల్లే సినిమా పరిస్థితిని ఊహించుకోవడానికే కష్టంగా ఉండేది.

వీ మూవీలో పవన్, మహేష్ ఉంటే

వీ మూవీలో పవన్, మహేష్ ఉంటే

ఇక తాజాగా పవన్ కల్యాణ్, మహేష్ కాంబినేషన్‌ కోసం ఆలోచనలు జరిగాయట. ఈ ఆలోచన ఈ సారి చేసింది మాత్రం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ సినిమా వీ కావడం విశేషం. తొలుత వీ సినిమా కథ రాసినప్పుడు పవన్, మహేష్‌ను ఊహించుకొని కథ రాశారట. అయితే వారిద్దరిని కలిపే విషయంలో ఎక్కడ తేడా కొట్టిందే బయటకి రాని విషయం.

ఇంద్రగంటి ఏం చెప్పారంటే..

ఇంద్రగంటి ఏం చెప్పారంటే..

తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలుత వీ సినిమాలో పవన్, మహేష్ అయితే బాగుంటుందనే కోరిక కలిగింది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు వారిద్దరు అయితే రేంజ్ మరోలా ఉండేది. కానీ చివరకు నానీ, సుధీర్‌బాబు కాంబినేషన్‌తో చేయాల్సి వచ్చింది.

నాని, సుధీర్ బాబు కాంబినేషన్‌కు మంచి క్రేజ్

నాని, సుధీర్ బాబు కాంబినేషన్‌కు మంచి క్రేజ్

ఇటీవల రిలీజైన వీ సినిమా ట్రైలర్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. నాని, సుధీర్ బాబు పాత్రలు ప్రోమోలో ఆకట్టుకొనేలా ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. నాని యాక్టింగ్ గురించి ఇండస్ట్రీలో అప్పుడే ఓ టాక్ బ్రహ్మండంగా వసున్నది. ఏది ఏమైనా ప్రతిభావంతులైన ఇద్దరు హీరోలు న్యాయం చేశారనే మాట వినిపిస్తున్నది.

Recommended Video

Prabhas - The Charity King In Tollywood | Filmibeat Telugu
వీ మూవీపై కరోనా దెబ్బ

వీ మూవీపై కరోనా దెబ్బ

నాని, సుధీర్ బాబు కాంబినేషన్‌లో రానున్న వీ చిత్రం వాస్తవానికి ఉగాది కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమలో లాక్‌డౌన్ ప్రకటించడం, థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకోవడంతో వీ సినిమా రిలీజ్ వాయిదా పడింది. పరిస్షితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X